గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు కార్చగల టాలెంటెడ్ యాక్టర్లు.. ఎవరంటే.. 

సాధారణంగా సినిమాలో నటించే యాక్టర్స్ డైరెక్టర్ నవ్వాలి అని చెప్పినప్పుడు నవ్వుతారు.ఏడ్వాలి అని సూచించినప్పుడు ఏడుస్తారు.

అయితే సహజంగా ఏడ్చినప్పుడు కన్నీళ్లు వస్తాయి కానీ యాక్ట్ చేస్తే రావు.కొన్ని సన్నివేశాల్లో కుండలు బాదుకోవాల్సిన అవసరం లేకుండా మామూలు ఫేసులో బాధ కన్నీళ్లు చూపించాల్సి వస్తుంది.

అలాంటప్పుడు గ్లిజరిన్ వాడక తప్పదు కానీ కొంతమంది టాలెంటెడ్ యాక్టర్లు ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండానే నిజంగానే ఏడ్చేసి సన్నివేశాలను బాగా పండించారు.వారు ఎవరో తెలుసుకుందాం.

• విజయ్ సేతుపతి:

2024లో విడుదలైన మిస్టరీ ఫిలిం "మహారాజా"లో విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) హీరోగా నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో విజయ్ కూతురుని రేప్ చేస్తారు.

Advertisement

దాని గురించి పోలీస్ స్టేషన్‌లో విజయ్ చెప్పాల్సి వస్తుంది అయితే రెండుసార్లు చెప్పి మూడోసారి కూడా చెప్పాల్సి వచ్చినప్పుడు విజయ్ సేతుపతి నిజంగానే ఏడ్చేసాడట.కన్నీళ్లతో అతడి ముఖమంతా తడిచి పోయిందట.

దీన్నిబట్టి ఈ నటుడు ఆ పాత్రలో ఎంతగా ఇన్వాల్వ్ అయ్యాడో అర్థం చేసుకోవచ్చు.నిజంగా ఒక బాధిత తండ్రి పడిన ఎమోషనల్ పెయిన్ అతను అనుభవించి ఉంటాడు.

• సమంత

( Samantha )ఓ బేబీ, దూకుడు వంటి సినిమాలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుంది సమంత.ఈ ముద్దుగుమ్మ కూడా పాత్రల్లో బాగా ఇన్వాల్వ్ అవుతుంది.అందుకే ఆమె అంత గొప్ప నటి అయ్యింది.

ఈ అందాల తార అల్లుడు శీను సినిమాలో చాలా ఏడ్చే సన్నివేశాలు ఉంటాయి అయితే వాటిలో ఆమె నిజంగానే కన్నీరు పెట్టుకుందట.గ్లిజరిన్ వాడాల్సిన అవసరం లేకుండా సమంత ఎమోషనల్ సన్నివేశాల్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఏడ్చేసిందని స్వయంగా డైరెక్టరే వెల్లడించాడు.

ట్రంప్‌పై ప్రశంసలు.. కానీ ఎవరికీ మద్ధతు ఇవ్వనంటూ వ్యాఖ్యలు, అంతుచిక్కని జుకర్‌బర్గ్ వైఖరి
వారానికి ఒక్కసారి ఈ హెయిర్ టానిక్ ను వాడితే వద్దన్నా మీ జుట్టు దట్టంగా పెరుగుతుంది!

• అక్షయ్ కుమార్

( Akshay Kumar ) ఆకాశం నీ హద్దురా, సూరరై పొట్రు (2020)కు హిందీ రీమేక్ అయిన "సర్ఫిరా" ( Surfira )మూవీలో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు అయితే ఈ మూవీలో చాలా ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయి.వాటిలో అక్షయ్ నిజంగానే గుక్కపెట్టి ఏడ్చాడట.అలా సహజ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.

Advertisement

అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.అక్షయ్‌ మాత్రం మంచి కథ గల ఈ మూవీలో నటించే ఛాన్స్ వచ్చినందుకు తాను చాలా లక్కీ అని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా హిట్ అయి ఉంటే అతనికి ఇంకా మంచి పేరు వచ్చి ఉండేది.

తాజా వార్తలు