పెద్ద హీరోల ముందు తేలిపోతున్న స్టార్ హీరోయిన్స్ ..ఇంకా మారరా ?

సినిమా.ఒక రంగుల ప్రపంచం.

హీరో కి హీరోయిజం చూపించే అవకాశం కావాలి.

హీరోయిన్ కి తన గ్లామర్ చూపించే అవకాశం కావాలి.

ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసే పనిలో కథ నడవాలి.అది ఎక్కడ దెబ్బ తిన్న కూడా రీల్ స్టోర్ రూమ్ కి వెళ్ళిపోతుంది.

ఇక ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలుగా చెప్పుకుంటున్న సో కాల్డ్ మూవీస్ అన్నిట్లో హీరోయిన్ తమ గ్లామర్ ని, లేదా తమలోని ట్యాలెంట్ ని చూపించే అవకాశం వచ్చిందా అంటే లేదు అనే చెప్పాలి.

Advertisement

బాహుబలి సినిమాతో అనుష్క కి చాల మైలేజ్ వచ్చిన కూడా అది ఆమె కెరీర్ ముందుకెళ్లడానికి ఉపయోగపడలేదు.అందులో పూర్తిగా అనుష్క సైడ్ నుంచి తప్పు ఉందని చెప్పాలి.సైజు జీరో వంటి సినిమా ఆమె కెరీర్ ని నాశనం చేసింది.

అప్పటికే చాల ఏళ్లుగా ఆమెకు సినిమా ఇండస్ట్రీ చాల ఇచ్చింది.ఆ తర్వాత ఆమెకు కెరీర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది.

ఇక ఆమె సంగతి పక్కన పెడితే మిగతా పెద్ద సినిమాల్లో లేదా పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్స్ పరిస్థితి ఎంత మాత్రం మెరుగు పడలేదు. RRR సినిమా చూసుకుంటే అలియా భట్ లాంటి పెద్ద హీరోయిన్ ని కూడా సినిమా వాడుకోలేకపోయింది.

అందులో కొంత పెద్ద హీరోల డామినేషన్ చూపించడానికి రాజమౌళి అలియా భట్ కి అన్యాయం చేసాడు అని చెప్పాలి.

త్వరలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా.. ఆ వివాదంపై జానీ మాస్టర్ క్లారిటీ ఇదే!
కిరణ్ అబ్బవరంకు పరోక్షంగా అల్లు అర్జున్ క్షమాపణలు చెప్పారా.. అసలేం జరిగిందంటే?

ఇక పుష్ప చిత్రానికి వస్తే రష్మిక ను అసలు కథలోకి లాగకుండా ఊరమాస్ పాతాళ కోసం ఆమెతో రొమాన్స్ కోసం వాడుకున్నాడు సుకుమార్.అల్లు అర్జున్ ని హైలెట్ చేయడం కోసం తప్ప రష్మిక గురించి ఆలోంచించింది ఏం లేదు.పోనీ మన సినిమా పరిశ్రమ మాత్రమే ఇలా తయారయ్యింది అనుకుంటే పొరపాటే.

Advertisement

కె జిఎఫ్ రెండు సినిమాల్లో హీరోయిన్ ఎందుకు ఉందో ఆమెకు కూడా తెలియదు.సినిమా అంటే ఒక హీరోయిన్ ఒక హీరో అనే కాన్సెప్ట్ కి న్యాయం చేయాలనీ మాత్రమే ప్రశాంత్ నీల్ శ్రీనిధి శెట్టి ని పెట్టాడు.

ఇక కాంతారా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.అసలు అందులో హీరోయిన్ కి ఇసుమంత ప్రాధాన్యత కూడా ఇవ్వలేదు రిషబ్.ఇదండీ ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్స్ పరిస్థితి.

తాజా వార్తలు