విక్రమ్ కొడుకు తెలుగు సినిమా ఎంట్రీ కి రంగం సిద్దం...

తమిళం లో హీరోలు గా సెటిల్ అయిన చాలా మంది తెలుగులో కూడా హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు.

అందుకే ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటుల్లో కొంత మంది మాత్రమే ఇక్కడ సెటిల్ అవుతున్నారు.

ఇక ప్రస్తుతం తమిళ్ హీరో విక్రమ్( Tamil Hero Vikram ) కూడా తన కొడుకుకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడేలా ఒక సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు గా తెలుస్తుంది.ఇప్పటికే ఈయన అర్జున్ రెడ్డీ సినిమా ను తమిళం లో రీమేక్ చేసి మరీ హిట్ కొట్టాడు అది యావరేజ్ గా ఆడింది.

ఇక దాంతో ఇప్పుడు తెలుగులోకి ద్రువ్ విక్రమ్( Dhruv Vikram ) ని తీసుకు వచ్చే పని లో విక్రమ్ ఉన్నట్టు గా తెలుస్తుంది.ఎందుకంటే ఇప్పటికే ఆయన చేసే సినిమా డైరెక్టర్ ని కూడా ఫైనల్ చేసినట్టు గా తెలుస్తుంది.

అయితే విక్రమ్ కూడా మొదట తెలుగులో సినిమాలు చేసిన ఆయన కి ఇక్కడ హీరో గా అవకాశాలు రాలేదు దాంతో ఆయన తమిళ్ సినిమాల్లో హీరో గా చేసి ఆ సినిమాలని తెలుగులో డబ్ చేసి ఒక మంచి హిట్ అయితే సాధించారు అలా ఆయన తెలుగులో కూడా మంచి మార్కెట్ అయితే ఏర్పాటు చేసుకున్నారు.ఇక విక్రమ్ బాటలోనే తన కొడుకుని కూడా ఇండస్ట్రీ లోకి తీసుకురావాలని విక్రమ్ చూస్తున్నట్టు గా తెలుస్తుంది.

Advertisement

అయితే ధృవ్ విక్రమ్ ఇక్కడ హిట్ కొట్టి ఇక్కడ మార్కెట్ ని సంపాదిస్తాడా అనేది చూడాలి.ఇక విక్రమ్ కూడా వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఒక్క హిట్ కూడా పడటం లేదు.అయితే విక్రమ్ కి అపరిచితుడు( Aparichitudu ) తర్వాత నుంచి కరెక్ట్ హిట్ ఒక్కటి కూడా ఇప్పటి వరకు పడలేదు అనే చెప్పాలి.

ఇక ఇప్పుడు తన కొడుకుని తెలుగులోకి దింపుతున్నాడు ఆయన ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.

Advertisement

తాజా వార్తలు