పట్టాలెక్కుతున్న కార్తికేయ సీక్వెల్ ! అర్జున్ సురవరం రిలీజ్ పై నిఖిల్ హోప్స్ లేనట్లే

వరుస ఫ్లాప్ ల తర్వాత స్వామీ రారా లాంటి సూపర్ హిట్ తో బౌన్స్ బ్యాక్ అయిన యంగ్ హీరో నిఖిల్ తర్వాత చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ అనే ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాతో మరో సూపర్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాతో వేసుకున్నాడు.

ఇక ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో నడిచే ఆ కథ 2014లో టాలీవుడ్ ప్రేక్షకులకి విపరీతంగా నచ్చేసింది.

ఇక అప్పట్లోనే ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కించాలని దర్శకుడు చందు, హీరో నిఖిల్ ప్లాన్ చేసారు.తరువాత ఇద్దరు ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు.

అయితే కార్తికేయ్ సీక్వెల్ పై మాత్రం దర్శకుడు చందూ, అటు నిఖిల్ హోప్స్ విడిచిపెట్టకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు.ఇదిలా ఉంటే హీరో నిఖిల్ ప్రస్తుతం అర్జున్ సురవరం అనే సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ కి సిద్ధం చేసాడు.

అయితే ఈ సినిమా రిలీజ్ అనుకున్నప్పటి నుంచి ఏవో అవాంతరాలు వస్తూనే ఉన్నాయి.ఇక ఈ నెల ఫస్ట్ వీక్ లో రిలీజ్ అనుకున్న మళ్ళీ ఎందుకనో వాయిదా పడింది.

Advertisement

ఈ నేపధ్యంలో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్పలేనని అందరికి సారీ అని నిఖిల్ చెప్పేసి ఇప్పుడు కార్తికేయ్ 2 సినిమాని మొదలుపెట్టేస్తున్నాడు.చందూ మొండేటి ఇప్పటికే బౌండ్ స్క్రిప్ట్ సిద్ధం చేసి షూటింగ్ కి రెడీ అయినట్లు తెలుస్తుంది.

త్వరలో ఈ సినిమా పట్టాలు ఎక్కుతుంది అని నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా నిర్మాతలు కూడా క్లారిటీ ఇచ్చేసారు.మొత్తానికి అర్జున్ మీద హోప్స్ వదిలేసుకొని ఇప్పుడు నిఖిల్ కార్తికేయ 2 మీద పెట్టాడని అర్ధమవుతుంది.

Advertisement

తాజా వార్తలు