మనం చేసిన ఆ పని వల్లే మనకు ఈ పరిస్థితి.. నిఖిల్ వైరల్ కామెంట్స్

ప్రస్తుతం కరోనా అనేది ఎన్నో వేల కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపుతున్నదో మనం చూస్తున్నాం.

కరోనా వచ్చింది ఇక మనం కోలుకోమేమో అన్న భయంతో చాలా మంది ప్రాణాలు వదులుకుంటున్న పరిస్థితి ఉంది.

ఇక ఈ సమయంలో అండగా ఉండాల్సిన నాయకులు చేతులెత్తేసిన పరిస్థితి ఉంది.అయితే సోనూసూద్ లాంటి వ్యక్తులు, ప్రణీత లాంటి వ్యక్తులు తప్ప పెద్దగా ఎవరూ స్పందించడం లేదు.

Nikhil Comments Viral On Govt, Nikhil, Voting, Covid Situation, Netizens, Hero N

ఇక ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చింది.ఇక మనకోసం ఎవరూ నిలబడరని.

అందుకే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తమ ప్రాణాలను నిలబెట్టుకుంటున్న పరిస్థితి ఉంది.ఇంతలా ప్రజలు అల్లాడుతున్న పరిస్థితులను చూసి హీరో నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేసాడు.

Advertisement

ఒక్కొక్కరు ఆక్సిజన్ అందక ప్రజల ప్రాణాలు కోల్పోతుంటే ఏ ఒక్క పాలకుడూ పట్టించుకోడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మనం ఓటేసి గెలపించుకున్నందుకు, ఓటేసే సమయంలో విజ్ఞతగా ఆలోచించి ఉంటే ఇటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒకరికొకరు సహాయం చేసుకుంటున్న పరిస్థితి చూస్తుంటే ఈ కాలంలో కూడా మానవత్వం బ్రతికే ఉందని నిరూపించారన్నారు.ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఇక హీరో నిఖిల్ కామెంట్స్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

మృతకణాలను పోగొట్టి మృదువైన చర్మాన్ని అందించే ఉత్తమ చిట్కాలు ఇవి!
Advertisement

తాజా వార్తలు