నిర్మాతగా మారడంతో డబ్బంతా పాయె.. డిప్రెషన్‌లో ప్రముఖ టాలీవుడ్ హీరో..?

సినిమా ఇండస్ట్రీలో, చాలామంది హీరోలు ఇతర యాక్టర్లు బాగా డబ్బు సంపాదిస్తుంటారు.వాటిని ఇంకా పెంచుకోవాలనే ఆశతో సినిమా నిర్మాణ రంగంలో అడుగుపెడతారు.

అయితే ప్రొడ్యూసర్లుగా మారిన నటులలో సక్సెస్ అయ్యేది కొంతమందే.మిగతా వారంతా నష్టపోతారు.

కొంతమంది అప్పుల్లో కూడా కూరుకుపోతారు.అలాంటి వారికి ఫ్రెష్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తున్నాడు నవదీప్.

ఇతనికి నటనలో చాలా మంచి టాలెంట్ ఉంది.కానీ అదృష్టం బాగోలేక మంచి క్యారెక్టర్లు రాక అగ్ర హీరో స్థాయికి చేరుకోలేకపోయాడు.

Advertisement

జై సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నవదీప్( Navdeep ) హీరోగా ఒకట్రెండు హిట్స్ సాధించాడు.తర్వాత ఆయన హీరోగా చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.

హీరోగా సక్సెస్ కాలేకపోయినా అతను నటన నుంచి తప్పుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్( Character artist ) గా బిజీ అయ్యాడు.కొన్ని సినిమాల్లో విలన్‌, అలానే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా చేశాడు.

తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం ( Tamil, Kannada, Malayalam )సినిమాల్లో కూడా అతనికి అవకాశాలు వచ్చాయి.ఇలా బాగానే డబ్బులు సంపాదిస్తూ చివరికి ప్రొడ్యూసర్ గా మారాడు.ఆయన నిర్మించిన "ఏవం" అనే సినిమా రీసెంట్ గానే రిలీజ్ అయింది.2024, జూన్ 14న థియేటర్లలో విడుదలైన "ఏవం" సినిమా( "Evam" movie ) ఫస్ట్ షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.ఏవం ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.

ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా చాందిని చౌదరి,( Chandni Choudhary ) విలన్ గా వశిష్ట సింహ( Vasishta Simha ) అద్భుతంగా నటించారు.అయితే కథలో దమ్ము లేకపోవడం వల్లే ఈ సినిమా ఫెయిల్ అయ్యింది.ఈ మూవీ నిర్మాణం కోసం నవదీప్ ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు చేశాడని సమాచారం.అలాగే ప్రమోషన్స్ కోసం కూడా లక్షల్లో డబ్బులు వెచ్చించాడు.

బడా హీరోలకోసం బలగం వేణు వెంపర్లాట... అదే ఆలస్యం చేస్తోందా?
వీడియో వైర‌ల్.. రోహిత్ భాయ్ ఆర్సీబీకి వ‌చ్చేయ్.. ఔనా అంటూ

ప్రకాష్ దంతులూరి( Prakash Dantuluri ) డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా బోరింగ్ గా అనిపించింది.ఆల్రెడీ ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్‌ ఎన్నో వచ్చాయి.

Advertisement

వాటికి డిఫరెంట్ గా, చాలా స్ట్రాంగ్ గా ఈ మూవీ ఉన్నట్లయితే హిట్ అయ్యేది.కానీ ఇది చాలా ప్రెడిక్టబుల్‌గా ఉండటం వల్ల ఫ్లాప్ అయ్యింది.

నవదీప్ కు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.మొత్తంగా దాదాపు రెండున్నర కోట్ల వరకు ఆయన ఈ సినిమా కోసం పెట్టే ఉంటాడు.

అవన్నీ నష్టపోయినట్టే.మళ్ళీ వాటిని సంపాదించాలంటే అతడు ఎన్ని సినిమాల్లో, ఎన్ని రోజులు కష్టపడాలో చెప్పాల్సిన పని లేదు.

ఈ డబ్బులు పోవడం వల్ల నవదీప్ కొద్దిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయినట్లుగా కూడా తెలుస్తోంది.

తాజా వార్తలు