కుల‌పిచ్చిపై నాని స్ట్రాంగ్ వార్నింగ్‌

ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో ఏ రంగంలో చూసినా క్యాస్ట్ ఫీలింగ్ అన్న‌ది కామ‌న్ అయిపోయింది.

ఎవ‌రైనా ఓ వ్య‌క్తి ఉన్న‌త స్థానంలోకి వెళితే ఆ క్యాస్ట్ వాళ్లు వాడు మ‌న‌వాడురా అని ఒక‌టే గొప్ప‌లు చెప్పుకుంటున్నారు.

ఇక మ‌న‌దేశంలో రాజ‌కీయాలు, సినిమాల‌ను కులాలే ఎక్కువుగా శాసిస్తున్నాయి.ఓ కులానికి చెందిన వ్య‌క్తి రాజ‌కీయంగా అయినా, సినిమా రంగంలో అయినా మంచి పొజిష‌న్‌లో ఉంటే ఇక ఆ కులానికి చెందిన వాళ్లు చేసే హంగామాకు అంతే ఉండ‌దు.

మ‌న టాలీవుడ్‌లోను హీరోల అభిమానుల మ‌ధ్య ఉన్న కుల పిచ్చి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.తాజాగా నేచుర‌ల్ స్టార్ నానిపై ఓ వ్య‌క్తి చేసిన విమ‌ర్శ‌పై నాని స‌ద‌రు వ్య‌క్తికి దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చాడు.

ఇటీవ‌ల దివంగ‌త మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాప‌కులు ఎన్టీఆర్ జ‌న్మ‌దిన సంద‌ర్భంగా నాని ఓ ట్వీట్ చేశాడు.‘దేవుడికి తమ జన్మదినోత్సవం ఎప్పుడో స్పష్టంగా తెలియనపుడు వారు ఈ రోజును ఘనంగా సెలబ్రేట్‌ చేసుకోవచ్చ’ని నాని ట్వీట్‌ చేశారు.

Advertisement

ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ వ్య‌క్తి నాని ఈ ట్వీట్ చేయ‌డానికి కులాభిమాన‌మే అని విమ‌ర్శించాడు.వెంట‌నే దానికి కౌంట‌ర్ ఇచ్చిన నాని ‘నేనూ మీలాగే తెలుగువాణ్ని.

ఎన్టీఆర్‌నే కాదు.చిరంజీవికి కూడా వీరాభిమానిని.

పెద్దలను గౌరవించే సంస్కారం ఉన్నవాణ్ని’ అని దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇవ్వ‌డంతో స‌ద‌రు వ్య‌క్తి ఆ ట్వీట్ వెంట‌నే డిలీట్ చేశాడు.

న్యూస్ రౌండప్ టాప్ 20 
Advertisement

తాజా వార్తలు