నాని, విక్రమ్‌ మూవీలో ఆరుగురు ముద్దుగుమ్మలు.. అంతమంది హీరోయిన్స్‌ ఎందుకంటే..!

యంగ్‌ హీరో నాని తాజాగా నాగార్జునతో కలిసి నటించిన దేవదాస్‌ చిత్రం ఫ్లాప్‌ అయ్యింది.

ఆ సినిమా నిరాశ పర్చడంతో నాని మరింత జోష్‌ తో ‘జెర్సీ’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.

భారీ అంచనాలున్న ‘జెర్సీ’ మూవీ వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.జెర్సీ మూవీ ఆన్‌ లొకేషన్‌లో ఉండగానే మరో మూవీని నాని మొదలు పెట్టబోతున్నాడు.

విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో నాని హీరోగా ఒక సినిమా రాబోతుంది.అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చిన విషయం తెల్సిందే.

విభిన్న చిత్రాల దర్శకుడిగా, తనకంటూ ఒక బ్రాండ్‌ను క్రియేట్‌ చేసుకున్న దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ప్రస్తుతం నాని కోసం తనదైన శైలిలో విభిన్నమైన స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఈ సినిమాలో ఇద్దరు కాదు, ముగ్గురు కాదు ఏకంగా ఆరుగురు హీరోయిన్స్‌ నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ చిత్రంలో నాని ఆడవారి సమస్యలపై పోరాడే వ్యక్తిగా కనిపిస్తాడని మొదటి నుండే ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.

Advertisement

అన్యాయంకు గురైన ఆడవారి పాత్రల్లో ప్రముఖ హీరోయిన్స్‌ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.అయిదుగురు హీరోయిన్స్‌ ముఖ్య పాత్రల్లో కనిపించనుండగా, మరో హీరోయిన్‌ మాత్రం నానితో రొమాన్స్‌ చేయనుందట.ఆ అయిదుగురు హీరోయిన్స్‌తో నానికి సినిమాలో కెమెస్ట్రీ ఉండట.

వారి పక్షాన పోరాడేందుకు మాత్రమే నాని పాత్ర ఉంటుందట.మొత్తానికి నాని మూవీలో ఆరుగురు హీరోయిన్స్‌ ఉండబోతున్న నేపథ్యంలో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు