గురు పౌర్ణమి రోజు ఏ పనులు చేయాలి.. ఏం చేయకూడదో తెలుసా..?

సంవత్సరంలో వచ్చే 12 తెలుగు నెలలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఒక్కో నెల ఒక్కో విశిష్టతను కలిగి ఉందని చెప్పవచ్చు.

ఈ క్రమంలోనే తెలుగు నెలలో నాలుగవ నెల అయిన ఆషాఢ మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది.ఈ ఆషాడ మాసంలో ఎన్నో పూజలు వ్రతాలకు పవిత్రమైనదిగా చెప్పవచ్చు.

ముఖ్యంగా ఈ ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది.ఈ ఆషాడ పౌర్ణమిని గురు పౌర్ణమి అని కూడా పిలుస్తారు.

ఈ గురు పౌర్ణమి రోజున వ్యాస మహర్షి పుట్టిన రోజున కూడా జరుపుకుంటారు.ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు ఎలాంటి పనులు చేయాలి.

Advertisement
Here We Are Talking About The Guru Poornima 2021 Dos And Donots In Telugu, Guru

ఎలాంటి పనులు చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం.ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు.

ఈ ఏడాది గురుపౌర్ణమి 2021 జూలై 24 శనివారం వచ్చింది.ఎంతో పవిత్రమైన గురుపౌర్ణమి రోజు గురువులను ఆరాధించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.

గురువు భగవంతుడు కంటే ఎంతో గొప్ప వాడని ఎన్నో అధ్యయనాలలో చెప్పబడింది.గురువు లేకపోతే మనుషులకు విజ్ఞానం లేదు.

ఎన్నో తెలియని విషయాలను గురువు ఇతరులకు బోధిస్తాడు.ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువును ఆరాధించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal

గురు పౌర్ణమి రోజు వేకువ జామున నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలంటు స్నానం చేసే వ్యాసుని ఫోటోకు ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేయాలి.

Here We Are Talking About The Guru Poornima 2021 Dos And Donots In Telugu, Guru
Advertisement

ఈ విధంగా గురు విగ్రహానికి పూజ చేసే సమయంలో పసుపు రంగు బట్టలు ధరించడం ఎంతో ఉత్తమం.అదేవిధంగా గురు విగ్రహానికి ముందు పసుపు రంగు బట్టలను సమర్పించే పూజించడం వల్ల గురువు అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటాయి.వివిధ రకాల కష్టాలతో, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యేవారు ఈ గురు పౌర్ణమి రోజున పసుపు రంగు ధాన్యాలను లేదా పసుపు రంగు మిఠాయిలను ఇతరులకు దానం చేయడం వల్ల సమస్యలు తొలగిపోయి ఎంతో ఆనందంగా గడుపుతారు.

ఎంతో పరమ పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఈ పనులు అసలు చేయకూడదు.గురు పౌర్ణమి రోజు నలుపు రంగులో ఉన్నటువంటి దుస్తులను ధరించకూడదు.అలాగే గురు పౌర్ణమి రోజు ఎలాంటి పరిస్థితులలో కూడా మద్యం, మాంసం తాకరాదు.

ఈరోజు గురు సేవలో నిమగ్నం అవ్వాలే తప్ప ఇతరులపై మన కోపాన్ని ప్రదర్శించకూడదు.పొరపాటున కూడా గురు పౌర్ణమి రోజు ఈ తప్పులను చేయకూడదని పండితులు చెబుతున్నారు.

తాజా వార్తలు