శరీరాన్ని శుద్ధి చేసి విషాలను బయటకు పంపే ఇంటి చిట్కాలు

సీజన్ మారినప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.అలాగే శరీరంలో విషాలు కూడా పేరుకుపోతాయి.

తేలికపాటి ఆహారంను మితంగా తీసుకోని విషాలను శరీరంలో నుంచి బయటకు పంపవచ్చు.అలాగే కొన్ని ఆహారాల ద్వారా కూడా విషాలను బయటకు పంపవచ్చు.

వాటి గురించి వివరాలను తెలుసుకుందాం.కొత్తిమీర శరీరంలో విషాలను బయటకు పంపటంలో కొత్తిమీర బాగా సహాయపడుతుంది.

దీనిలో ఆవశ్యక నూనెలు ఉండుట వలన బ్యాక్టీరియాను చంపి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.కొత్తిమీర జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి వికారాలను తగ్గిస్తుంది.

Advertisement

అలాగే రక్తంలో చక్కర స్థాయిలను బాలన్స్ చేస్తుంది.కూరలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీరను జల్లితే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.

త్రిఫల చూర్ణం త్రిఫల చూర్ణంలో ఉన్న గుణాలు విషాలను బయటకు పంపటంలో సహాయపడతాయి.త్రిఫల చూర్ణంను ఉసిరి కాయ, కరక్కాయ, తానికాయలతో తయారుచేస్తారు.

అరకప్పు వేడినీటిలో ఒక స్పూన్ త్రిఫల చూర్ణాన్ని కలిపి చల్లారిన తర్వాత త్రాగాలి.వేపాకు వేపాకు జీర్ణశక్తిని పెంచటమే కాకుండా కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.

ప్రతి రోజు రెండు లేదా మూడు వేపాకులను తినటం వలన పేగుల్లోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు నశించి ప్రేగు శుభ్రపడుతుంది.పుదీనా పుదీనా ఆహారం త్వరగా జీర్ణం కావడానికి తోడ్పడుతుంది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
మేఘాలలో భయంకరమైన ఆకారాలు.. వీడియో చూస్తే వణుకు పుడుతుంది!

పుదీనా టీ తాగడం వల్ల పొట్ట శుభ్రం అవుతుంది.కడుపు నొప్పి, గ్యాస్ వదలడం, మలబద్దకం లాంటి సమస్యలను దూరం చేస్తుంది.

Advertisement

రక్తాన్ని శుద్ధి చేయడంలో, శరీరంలోని విషాలను తొలగించడంలో అద్భుతంగా పని చేస్తుంది.

తాజా వార్తలు