హార్ట్ టచింగ్.. తండ్రిని చూసి భావోద్వేగానికి గురైన కూతుళ్లు.. ఎందుకంటే?

ప్రస్తుత ప్రపంచంలో కన్నవారిని ఆస్తుల కోసం మరే ఇతర విషయాల కోసం కాటికి పంపిస్తున్న రోజులు ఇవి.

అయితే ఇలాంటి సమాజంలో తాజాగా జరిగిన ఓ ఘటన అందరి కంటతడి పెట్టిస్తోంది.

దీనికి కారణం ఆరు సంవత్సరాల తర్వాత తండ్రిని ఇద్దరు కూతుర్లు(Daughters) కలవడం.ఆరు సంవత్సరాల ముందు తప్పిపోయిన తండ్రిని అనాధాశ్రమంలో చూసిన ఇద్దరు కూతుర్లు భావోద్వేగానికి గురైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media)తెగ వైరల్ అవుతుంది.

ఈ ఘటన హైదరాబాద్(Hyderabad) నగరంలోని మాతృదేవో అనాధాశ్రమంలో (Matrudevo Orphanage)చోటుచేసుకుంది.ఈయన రాష్ట్రంలో 130 మంది అనాధలు జీవిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆరు సంవత్సరాల క్రితం మతిస్థిమితం కోల్పోయి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి(Jubilee Hills Peddamma Temple) వద్ద పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న బాలయ్య అనే వ్యక్తిని, మాతృదేవో అనాధాశ్రమం నిర్వాహకులు చేరదీసి ఆశ్రయన్ని కల్పించారు.ఆనాటి నుంచి ఇప్పటివరకు బాలయ్య అదే ఆశ్రమంలో ఉన్నాడు.

Advertisement

ఈ నేపథ్యంలో మాతృదేవోభవ ఆశ్రమానికి వచ్చి తన తండ్రి తప్పిపోయాడని, తప్పిపోయిన సమయంలో మతిస్థిమితం లేదని, తాము తండ్రి వెతుకుతున్నట్లు ఆయన కూతురు దివ్య తెలిపింది.అయితే, వారి ఇంట్లోని ఏదో కార్యక్రమం సందర్భంగా బాలయ్య కూతుర్లు ఇద్దరు మాతృదేవోభవ అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

అయితే, అదృష్టవశాత్తు అదే అనాధాశ్రమంలో (orphanage) జీవిస్తున్న అతని తండ్రిని చూసి కూతుర్లు గుర్తుపట్టి కన్నీటి పర్యంతాం అయ్యారు.130 మందిలో వారి తండ్రిని చూసిన ఇద్దరు కూతుర్లు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.వారిద్దరు తన తండ్రిని చూస్తేనే నాన్న అంటూ.

దగ్గరికి వెళ్లగా బాలయ్య ఒక్కసారిగా భయభ్రాంతులకు లోనయ్యాడు.దీంతో అనాధాశ్రమం నిర్వాహకులు వెంటనే బాలయ్యకు వీళ్ళు నీ కూతుర్లే అనడంతో కాసేపు ఆయన కూతుర్లు, మన వాళ్ళతో ఆనందంగా గడిపారు.

ఆ తర్వాత ఆశ్రమ నిర్వాహకులు కొన్ని కండిషన్స్ పెట్టి బాలయ్యను తిరిగి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.

క్యాబినెట్ భేటీ లో కీలక నిర్ణయం ... మహిళలకు పండుగే 
అడవిలో మంటను ఎలా పుట్టించాడో.. ఇది మాములు క్రియేటివిటీ కాదు, భయ్యో!

ఆ అమ్మాయిలు నిజంగా అదృష్టవంతులని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు