కరోనాతో గుండెపోటు.. వ్యక్తి మృతి..!

రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.రోజుకు వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ప్రభుత్వం టెస్టుల సంఖ్యను పెంచడంతో కేసు గణనీయంగా నమోదవుతున్నాయి.కరోనాతో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు కరోనా సోకిందనే భయంతోనే ప్రాణాలు విడుస్తున్నారు.

భయంతోనే ఇప్పటి చాలా మంది ప్రాణాలు విడిచారు.ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది.

కరోనా వచ్చిందని భయంతో ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించిన ఘటన తిరుపతి జిల్లా కరకంబాడి రోడ్డులోని వినాయకసాగర్ లో చోటు చేసుకుంది.వినాయకసాగర్ సమీపంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో నివాసముంటున్న ఓ కుటుంబంలో జలుబు, జ్వరంతో బాధపడుతూ తండ్రీ కొడుకులు కరోనా పరీక్షలు చేయించుకున్నారు.

Advertisement

పరీక్షలు చేయించుకుని ఇంటికి వచ్చారు.మరుసటి రోజు (శనివారం) బయటకు వెళ్లి ఇంటికి వచ్చిన వీళ్లిద్దరూ అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లిఫ్ట్ లోకి ఎక్కారు.

లిఫ్ట్ లో ఉన్నప్పుడు ఫోన్ లో కరోనా పాజిటివ్ వచ్చిందని మెసేజ్ వచ్చింది.దీంతో తండ్రి (67) ఆందోళన చెందడంతో హార్ట్ అటాక్ రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

ఆస్పత్రి సిబ్బంది చేరుకుని మృతదేహాన్ని తరలించారు.ఈ మేరకు కొడుకును హోం క్వారంటైన్ చేసి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

రేవంత్ కు టార్గెట్ అయిపోయిన హరీష్ రావు
Advertisement

తాజా వార్తలు