చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో భాగంగా బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ పిటిషన్ పై ఇప్పటికే చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.ఇవాళ సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించనున్నారు.

Hearing On Chandrababu's Regular Bail Petition-చంద్రబాబు ర�

అయితే గత విచారణలో భాగంగా ఇవాళ ఖచ్చితంగా వాదనలు వినిపించాలని సీఐడీ లాయర్లకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.గత నెల 31వ తేదీన చంద్రబాబు హెల్త్ కండీషన్స్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పై విడుదల అయ్యారు.

కాగా ఈనెల 28తో చంద్రబాబు మధ్యంతర బెయిల్ ముగియనుంది.కాగా ఇవాళ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిసే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు