చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ

టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ఉల్లంఘించారన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు గవర్నర్ అనుమతి తీసుకోకుండానే సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.రాజకీయ కారణాలతో కక్ష పూరితంగా అక్రమ కేసు బనాయించారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో నమోదైన కేసును కొట్టివేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.ఈ క్రమంలో ఐటెం నంబర్ 61గా చంద్రబాబు కేసు లిస్ట్ అయిందని తెలుస్తోంది.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement