అజయ్ కల్లం రిట్ పిటిషన్ పై టీఎస్ హైకోర్టులో విచారణ

ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లం దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన వాంగ్మూలంపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు.

సీబీఐ తన వాంగూల్మాన్ని తప్పుగా నమోదు చేసిందని పిటిషన్ లో పేర్కొన్నారు.తను చెప్పింది ఒకటైతే దాన్ని మార్చిన సీబీఐ ఛార్జ్ షీట్ లో మరో విధంగా పేర్కొందని ఆరోపించారు.

సీఎం జగన్ ను భారతి పిలిచారని సీబీఐకి తాను చెప్పలేదన్నారు.ఈ క్రమంలోనే ఛార్జ్ షీట్ నుంచి తన వాంగూల్మం అంటూ సీబీఐ పొందుపరిచిన విషయాన్ని తొలగించాలని పిటిషన్ లో కోరారు.

ఈ నేపథ్యంలో అజయ్ కల్లం రిట్ పిటిషన్ పై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది.

Advertisement
కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?

తాజా వార్తలు