మ‌ట్టి కుండ‌లో నీళ్లు తాగితే..ఆ జ‌బ్బులు దూరం!

ప్ర‌స్తుత కాలంలో దాదాపు అంద‌రూ స్టీలు బిందెలు, ప్లాసిక్ బిందెలు, వాట‌ర్‌ ప్యూరీ ఫైర్లు వంటి వాటిలోనే నీటిని స్టోర్ చేసుకుని తాగుతున్నారు.

నీటిని కాస్త చ‌ల్ల‌గా తాగాల‌నుకునే వారు.

ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని తాగుతున్నారు.అయితే, పూర్వ కాలంలో మాత్రం అంద‌రి ఇళ్ల‌ల్లోనూ మట్టితో త‌యారు చేసిన కుండ‌లే ఉండేవి.

వాటిలోనే నీటిని స్టోర్ చేసుకుని తాగే వారు.మ‌ట్టి కుండ‌లో నీరు చ‌ల్ల‌గా, రుచిగా ఉండ‌ట‌మే కాదు.

ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేస్తాయి.కుండ‌లో స్టోర్ చేసిన నీరు తాగితే.

Advertisement
Health Benefits Of Drinking Water From Clay Pot! Health, Benefits Of Clay Pot Wa

తిన్న‌ ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది.గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్యలు దూరం అవుతాయి.

మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా మెరుగు ప‌డుతుంది.అలాగే ప్ర‌స్తుత‌ వేస‌వి కాలంలో ఇబ్బంది పెట్టే వ‌డ‌దెబ్బ స‌మ‌స్య నుంచి ర‌క్ష‌ణ పొందాలి అని అనుకునే వారు మ‌ట్టి కుండ‌లో నిల్వ చేసిన నీరు తాగ‌డ‌మే మంచిదంటున్నారు నిపుణులు.

మ‌ట్టి కుండ‌లో నీరు తాగితే.శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రిచి వ‌డ దెబ్బ బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది.

మట్టిలో వివిధ రక‌ర‌కాల విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ నిండి ఉండాలి.అయితే మట్టికుండల్లోనూ ఆ పోష‌కాలు ఉంటాయి.

వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

అందువ‌ల్ల మ‌ట్టి కుండ‌లో నీటిని నిల్వ‌ చేసి తాగితే.మ‌న శ‌రీరానికి అనేక పోష‌కాలు ల‌భిస్తాయి.

Health Benefits Of Drinking Water From Clay Pot Health, Benefits Of Clay Pot Wa
Advertisement

ఇక ప్ర‌స్తుతం వేస‌వి తాపాన్ని తీర్చుకునేందుకు చాలా మంది ఫ్రిడ్జ్ వాట‌ర్‌నే ఎంచుకుంటారు.ఫ‌లితంగా.జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, అధిక బ‌రువు, ఆస్త‌మా వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌తారు.

కానీ, మ‌ట్టి కుండ‌లోని నీటిని తాగితే.వేస‌వి తాపం తీర‌డ‌మే కాదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండ‌వు.

పైగా కుండలో నీరు నిల్వ చేసి తాగడం వల్ల ఇమ్యూనిటీ సిస్ట‌మ్ కూడా బ‌లంగా మారుతుంది.

" autoplay>

తాజా వార్తలు