ఉసిరికాయలు తింటే ఇన్ని లాభాలున్నాయి

ఉసిరి చాలా ఆరోగ్యకరమైనది.ఆయిర్వేదంలో కూడా ఉసిరికి ఎంతో ప్రధాన్యతనిచ్చారు.

ఇది మనదేశంలో బాగా దొరుకుతుంది.

అందుకే ప్రాచీన కాలం నుంచి ఉసిరిని మెడికల్ సోర్స్ గా వాడుతున్నారు.

ఈ ఉసిరి వలన ఎన్నో లాభాలున్నాయి.కొన్ని ఇప్పుడు చూడండి.

* వంద గ్రాముల ఉసిరిలో 445 మిల్లిగ్రాముల విటమిన్ సి దొరుకుతుంది.ఇది మాత్రమే కాదు, ఉసిరిలో పోలిఫెనల్స్, గాల్లిక్ ఆసిడ్, ఎల్లాజిక్ ఆసిడ్, ఫ్లెవోనైడ్స్.

Advertisement

ఇలా శరీరానికి కావాల్సిన ఎన్నో అవసరాలు దొరుకుతాయి.* ఉసిరిలో యాంటిఆక్సిడెంట్స్ మంచి మోతాదులో దొరుకుతాయి.

ఈ లక్షణం వల్లే రాడికల్స్‌ తో పోరాడగలుగుతుంది ఉసిరి.* ఉసిరి బాగా తినే అలవాటు ఉన్నవారికి వయసు తొందరగా కనబడదని, లేటు వయసులో కూడా యవ్వనంగా కనిపిస్తారని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

* ప్రోటీన్ మెటబాలిజంని సరైన ట్రాక్ లో పెట్టాలంటే ఉసిరి తినడం మంచి మార్గం.తద్వారా బరువు కూడా పద్ధతిగా తగ్గొచ్చు.

* ఉసిరిలో యాంటిబ్యాక్టిరియల్ లక్షణాలు ఎక్కువగా లభిస్తాయి.రెగ్యులర్ గా తింటే రోగనిరోధకశక్తి పెరుగుతుంది.

మీ ఇంట్లో ఈ వస్తువులు అయిపోతే.. మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం ఖాయం..!

* ఉసిరి దంతాలకు బలాన్నిస్తుందని పరిశోధకులు కొన్నేళ్ళుగా చెబుతూనే ఉన్నారు.* పీరియడ్స్ లో ఉసిరి తినడం అమ్మాయిలకి ఎంతో మంచిది.

Advertisement

పీరియడ్స్ లో వచ్చే నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఉసిరి పనికివస్తుంది.* ఉసిరి జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది.

శరీరం ఎక్కువ న్యూట్రింట్స్ తీసుకునేలా చేస్తుంది ఉసిరి.కాబట్టి తిన్న తిండి బాగా జీర్ణం అవుతుంది.

* ఉసిరి కురులకి మంచిదని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదనుకుంటా.మన ఇంట్లో అమ్మో, నానమ్మో ఉసిరి వెంట్రుకలకి బలాన్నిస్తుందని చెబుతుంటే చిన్ననాటి నుంచి వింటూనే ఉన్నాం.

కురులు షైనీగా, ఆరోగ్యంగా ఉండటానికి ఉసిరి ఉపయోగపడుతుంది.

తాజా వార్తలు