విమ‌ర్శ‌ల‌కు త‌న‌దైన స్టైల్‌లో కౌంట‌ర్ ఇచ్చిన అయ్య‌న్న‌పాత్రుడు.. వైసీపీకి షాక్‌..

ఇప్పుడు ఏపీలో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ రాజ‌కీయాలు మ‌రింత ముదురుతున్నాయి.మొన్న‌టి వ‌ర‌కు మాట‌ల‌కు ప‌రిమితం అయిన విమ‌ర్శ‌లు ఇప్పుడు దాడుల వ‌ర‌కు వెళ్తున్నాయి.

రీసెంట్ గా టీడీపీ మాజీ మ‌త్రి అయ్య‌న్న పాత్రుడు ఏపీ సీఎం జ‌గ‌న్ మీద చేసిన వ్యాఖ్య‌లు పెద్ద దుమార‌మే రేపాయి.దీంతో వైసీపీ నేత‌లు ఆయ‌న మాట‌ల‌పై భ‌గ్గుమంటున్నారు.

ఇక ఆయ‌న మాట‌ల‌కు నిర‌స‌న‌గా ఎమ్మెల్యే జోగి నేతృత్వంలో వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఏకంగా చంద్ర‌బాబు ఇంటిని కూడా ముట్ట‌డించారు.దీంతో ఇరు పార్టీల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

అయితే ఒక సీఎంను ప‌ట్టుకుని అలా అంటారా అంటూ న‌లువైపుల నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.దీంతో తన వ్యాఖ్యలపై అయ్య‌న్న పాత్రుడు స్పందిస్తూ త‌న‌పై వచ్చిన విమర్శలకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.

Advertisement
He Deserves To Be Given A Counter In His Own Style For Criticism .. Shock To YCP

వాస్త‌వానికి తాను సీఎం జ‌గ‌న్‌ను అగౌర‌వ ప‌ర్చ‌లేద‌ని, ఆయ‌న చ‌ర్చికి వెళ్లిన‌ప్పుడు ఫాదర్ ఎలాగైనా ఓ మై సన్ అని సంబోధిస్తారో తాను కూడా అలాగే అన్నాన‌ని, అంతే గానీ ఇందులో అనుచిత వ్యాఖ్య‌లు ఏమీ లేవ‌ని త‌న‌దైన స్టైల్లో వివరణ ఇచ్చారు.ఇప్పుడు ఏపీ కేబినెట్ లో మంత్రులు మాట్లాడుతున్న వాటినే తాను అన్నాన‌ని చెప్పారు.

He Deserves To Be Given A Counter In His Own Style For Criticism .. Shock To Ycp

ఇక దీన్ని త‌ప్పుదోవ ప‌ట్టించే విధంగా వైసీపీ నేత‌లు హద్దులు దాటి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్ట‌డించ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని ప్ర‌శ్నించారు.ఒక ప్రతిపక్ష నేత ఇంటిని ఇలా ముట్టడి పేరుమీద దాడి చేయ‌డం ఎంత వ‌ర‌కూ స‌రికాద‌ని విమ‌ర్శించారు.ఇక ఈ దాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించాల‌ని, ప్ర‌జాస్వామ్యంపై జ‌రుగుతున్న దాడిలాగా దీన్ని చూడాలంటూ చెప్పారు.

ఏదేమైనా కూడా అయ్య‌న్న పాత్రుడు ఇప్పుడు వైసీపీకి స‌మాధానం చెప్ప‌లేని విధంగా కౌంట‌ర్ వేశార‌ని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు