ఫ్లవర్ పాట్ పగులగొట్టి హీరో అయిపోయాడు.. అదెలాగంటే..

మనం కావాలని చేయకపోయినా అప్పుడప్పుడు ఒకసారి తప్పులు జరుగుతూ ఉంటాయి.ప్రమాదవశాస్తూ కొన్ని జరుగుతూ ఉంటాయి.

అప్పుడు మనం క్షమాపణలు చెప్పడం తప్ప ఏం చేయలే.ఇక చిన్న చిన్న తప్పులను అయితే ఎవరు పెద్దగా పట్టించుకోరు.

ఇలాంటివి సాధారణమే అంటూ లైట్ తీసుకుంటారు.కొంతమంది అనుకోకుండా జరిగిన తప్పులకు కూడా సారీ చెబుతారు.

కానీ ఓ ఫుడ్ డెలివరీ బాయ్( food delivery boy ) చేసిన పని ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.ఇది అందరినీ ఆలోచింపచేస్తుంది.

Advertisement

ఒక ఫుడ్ డెలివరీ బాయ్ ఆర్డర్ ఇచ్చేందుకు ఒక ఇంటికి వెళ్లాడు.అయితే అక్కడ వరండాలో పొరపాటున పూల కుండీని ( flower vase )తగిలాడు.దీంతో పూలకుండి కిందపడి పగిలిపోయింది.

దీంతో యజమానికి క్షమాపణలు చెప్పాడు.అవసరమైతే డబ్బులు పే చేస్తానంటూ యజమానికి చెప్పాడు.

కానీ యజమాని డబ్బులు తీసుకునేందుకు నిరాకరించాడు.పొరపాటుగా జరిగిన దానికి డబ్బులు అవసరం లేదని చెప్పాడు.

ప్రమాదవశాత్తూ ఇలా అందరికీ జరుగుతాయని, దీనికి ఫీల్ అవ్వొద్దని చెప్పి డెలివరీ బాయ్ ను పంపించాడు.

పెసలతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. మరి వారానికి ఒక్కసారైనా వాటిని తింటున్నారా?

అయితే డెలివరీ బాయ్ అంతటితో ఊరుకోలేదు.తన వల్ల పగిలిపోయిన పూల కుండికి బదులు మరో పూల కుండిని కొనివ్వాలని నిర్ణయించుకున్నాడు.దీంతో ఒక పూల కుండిని కొనుగోలు చేసి యజమాని ఇంటి ముంద పెట్టేసి వెళ్లిపోయాడు.

Advertisement

ఈ సందర్భంగా పూల కుండితో పాటు ఒక లెటర్ రాసి పెట్టాడు.తన వల్ల జరిగిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా పూలకుండీని ఇస్తున్నానని, దీనిని స్వీకరించాలని కోరాడు.కొత్త పూల కుండీని కొనుగోలు చేసి ఇస్తున్నట్లు తెలిపాడు.

ఈ విషయాన్ని ఇంటి యజమాని ట్విట్టర్ లో పంచుకున్నాడు.డెలివరీ బాయ్ క్షమాపణ చెప్పిన తీరుకు ఫిదా అయిపోయినట్లు తెలిపాడు.

యజమాని అవసరం లేదని చెప్పినా డెలివరీ బాయ్ ఇలా తన తప్పును తెలుసుకుని పరిష్కరించుకున్నాడు.

తాజా వార్తలు