ఆన్‌లైన్‌లో డ్రోన్ కెమెరా కొనుగోలు చేశాడు.. తీరా ఆర్డర్ ఏం వచ్చిందంటే

భారతదేశంలో ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది.ఈ సమయంలో ప్రజలు ఎక్కువగా తమకు నచ్చిన వాటిని కొనుగోలు చేస్తుంటారు.

ముఖ్యంగా వాహనాలు, ఇంట్లోకి కావాల్సిన సామాన్లు వంటివి ఎంత రేట్ అయినా కొనుగోలు చేస్తుంటారు.ఇదే సమయంలో కస్టమర్లను ఆకర్షించడానికి, తమ సేల్స్ పెంచుకోవడానికి ఆన్‌లైన్‌ షాపింగ్ సంస్థలు పలు ఆఫర్లను ప్రకటిస్తాయి.

ఇలాంటి తరుణంలో తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులు వస్తుంటాయి.దీంతో వెంటనే తాము కొనాలకున్న వస్తువును చాలా మంది ఆర్డర్ పెట్టేస్తుంటారు.

అయితే వచ్చిన ఆర్డర్ చూడగా తెల్లబోతారు.అందులో సబ్బులు, ఇటుకలు వంటివి కనిపిస్తున్నాయి.

Advertisement
He Bought A Drone Camera Online What Happened To The Happened To The Order, Onli

తాజాగా ఇలాంటి అనుభవం ఓ వ్యక్తికి ఎదురైంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

He Bought A Drone Camera Online What Happened To The Happened To The Order, Onli

ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ల్యాప్‌టాప్‌ ఆర్డర్ ఇస్తే, డిటర్జెంట్ సోప్‌లు వచ్చాయి.ఇదే కోవలో బీహార్‌లో కూడా ఇలాంటి ఘటన జరిగింది.ఇటీవల, నలందలోని పర్వాల్‌పూర్‌లో ఒక వ్యక్తి మీషో నుండి డ్రోన్ కెమెరా ఆర్డర్ చేశాడు.

దానిని డెలివరీ ఎగ్జిక్యూటివ్ తీసుకొచ్చాడు.అయితే చాలా ఎగ్జైట్‌మెంట్‌తో ఆ పార్సిల్ ఓపెన్ చేయాలనుకున్నాడు.

అయితే ఎందుకో అతడికి అనుమానం వచ్చింది.ఖరీదైన డ్రోన్ కెమెరాకు బదులు ఇంకేదైనా వస్తే తాను మోసపోతానని గ్రహించాడు.

మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

దీంతో కెమెరాతో వీడియో తీశాడు.ఆ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌తోనే ఆ పార్సిల్ ఓపెన్ చేయించాడు.

Advertisement

తీరా ఓపెన్ చేసిన తర్వాత అందులో డ్రోన్ కెమెరాకు బదులు బంగాళాదుంపలు ఉన్నాయి.దీంతో అతడి అనుమానం నిజమైంది.

ఆర్డర్ చేసిన వ్యక్తి పేరు చైతన్య కుమార్. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని అతడు సోషల్ మీడియలో పెట్టాడు.

మీషో నుండి DJI డ్రోన్ కెమెరాను ఆర్డర్ చేశానని, అందు కోసం 10,212 చెల్లించానని తెలిపాడు.దాని అసలు ధర రూ.84,999 అయితే చాలా తగ్గింపు ధరకు దానిని ఆఫర్‌లో పెట్టానని భావించినట్లు చెప్పాడు.దీనిపై పోలీసులను మీడియా సంప్రదించగా, తమకు ఈ విషయంపై ఫిర్యాదు అందలేదని చెప్పారు.

ఫిర్యాదు చేస్తే బాధ్యులపై కేసు పెట్టి, బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని పేర్కొన్నారు.

తాజా వార్తలు