నటి రేవతి 10 ఏళ్ళ కుమార్తె మహి ని చూసారా ? అమ్మ కన్నా అందగత్తె

నటి రేవతి( Actress Revathi ).సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో నటించి కేవలం నటనలోనే కాదు దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చాటుకుని అనేక అవార్డులు దక్కించుకున్న అతి తక్కువ మందిలో రేవతి కూడా ఉంటుంది.

ప్రస్తుతం రేవతికి 57 సంవత్సరాలు.ఏమి అసలు పేరు ఆశ( asha ).కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక ఆమె పేరును రేవతిగా మార్చుకుంది.మొదట భరతనాట్యంలో శిక్షణ పొంది ఏడు సంవత్సరాల వయసు నుంచి నాట్యాన్ని ప్రాక్టీస్ చేస్తూనే చెన్నైలో తన తొలి ప్రదర్శన ఇచ్చింది.

ఇక సినిమా ఇండస్ట్రీలో అనేక విభాగాల్లో నేషనల్ అవార్డ్స్, ఫిలింఫేర్ అవార్డ్స్( National Awards, Filmfare Awards ) తో పాటు ఎంతో మంది ప్రముఖుల ప్రశంసలు కూడా దక్కించుకుంది రేవతి.

రేవతి కుటుంబంలో మొదటి నుంచి నటీనటులు ఎవరూ లేరు కానీ ఆమెకు అనుకోకుండా వచ్చిన ఈ అవకాశం తో సినిమా ఇండస్ట్రీలోనే సెటిల్ అయిపోయింది.ఇక 1986లో ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ అయినా సురేష్ చంద్ర మీనన్ ( Suresh Chandra Menon )ను పెళ్లి చేసుకుంది.కానీ వీరికి సంతానం కలగకపోవడంతో అనేక సమస్యలు తలెత్తి 18 సంవత్సరాల వైవాహిక బంధానికి గుడ్ బై చెబుతూ ఆమె విడాకులు పొందారు.

Advertisement

తన జీవితం నాశనం కావడానికి ఎవరు కారణం అనే విషయం ఎప్పటికీ ఆమె బయట పెట్టకపోయినా భర్త వల్లే తనకు పిల్లలు పుట్టలేదు అని రేవతికి చాలా క్లియర్ గా తెలుసు.ఇక 2003లో ఆమెకు విడాకులు రాగా ఆ తర్వాత ఆమె ఒక పాపకు జన్మ ఇచ్చింది.

ఇక రేవతి కుమార్తె ఎవరు అనే విషయం మాత్రం ఆమె ఎప్పుడూ మీడియాకి చూపించింది లేదు.ఆమె పేరు మహి( Mahi ) కాగా ఆమె 2013లో పుట్టగా, 2018లో ఆ పాపకి ఐదు సంవత్సరాల వయసున్న సమయంలో తన పాప గురించి బయట ప్రపంచానికి తెలిపింది.భర్తతో సంబంధం లేకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి IVF పద్ధతి ద్వారా ఆమె తన కుమార్తెకు జన్మ ఇచ్చింది.

కానీ ఆమె తండ్రి ఎవరు అనే విషయం ఆమెకు కూడా తెలియదు.ప్రస్తుతం ఆ పాప వయసు పది సంవత్సరాలు కాగా ఇటీవల రాధ కుమార్తె కార్తీక వివాహ సమయంలో ఆమెకు సంబంధించిన ఫోటోలు నెట్ లో హల్చల్ చేశాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 5, ఆదివారం, జ్యేష్ఠ మాసం , 2022
Advertisement

తాజా వార్తలు