ఇన్‌స్టాలో వచ్చిన ఈ కొత్త అప్డేట్ గమనించారా?

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ వున్న సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ తమ యూజర్లను మరింత ఆకర్శించుకోవడం కోసం కొత్తకొత్త అప్డేట్స్ తీసుకువస్తోంది.

అవును, ఇపుడు ఇన్స్టాలో అవతార్‌ని క్రియేట్‌ చేసుకోవడం చాలా ఈజీ.

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలో మనకు నచ్చిన అవతార్‌ సృష్టించుకునే అవకాశాన్ని మెటా కల్పించింది.తద్వారా మన స్నేహితులతో చాట్ చేస్తున్నప్పుడు మనకు నచ్చిన అవతార్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు.

అలాగే ప్రొఫైల్ పిక్‌ను కూడా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు.ఇన్‌స్టాలో మీ అవతార్‌ను క్రియేట్‌ చేసుకోవడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.1.ముందుగా మీ ప్రొఫైల్‌లోకి వెళ్లిన తరువాత స్క్రీన్‌ రైట్‌ కార్నర్‌లోని హంబర్గర్‌ మెనూ మీద క్లిక్‌ చేయాలి.2.తరువాత ఎకౌంట్‌ అవతార్‌లోకి వెళితే ‘అవతార్‌ మేకింగ్‌ స్క్రీన్‌’ ఓపెన్‌ అవుతుంది.3.ఆ తరువాత స్కిన్‌ టోన్‌ను ఎంపిక చేసుకొని మీ ఇన్‌స్టా అవతార్‌ను తయారు చేసుకోవాలి.4.మీ అవతార్‌కు మీకు నచ్చినట్టయితే స్క్రీన్‌ టాప్‌రైట్‌ కార్నర్‌లోని ‘డన్‌’ మీద క్లిక్‌ చేయాలి.5.ఫేస్‌స్ట్రక్చర్, హెయిర్‌ స్టైల్, నోస్‌షేప్‌.మొదలైన ఆప్షన్స్‌ను యూజర్‌ ఇక్కడ ఎంపిక చేసుకోవచ్చు.

ఇకపోతే, ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ అయినటువంటి స్నాప్‌చాట్ ఇండియాలో స్నాప్‌చాట్+ సబ్‌స్క్రిప్షన్‌ను నెలకు కేవలం 49/-కే అందిస్తోంది. దీనిలో భాగంగా యూజర్లు ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌పెరిమెంటల్, ఫ్రీ రిలీజ్‌ ఫీచర్లతో యాక్సెస్‌ కావచ్చు.

Advertisement

రీవాచ్‌ ఇండికేటర్, బ్యాడ్జ్, కస్టమ్‌ యాప్‌ ఐకాన్స్, బెస్ట్‌ఫ్రెండ్స్‌ ఫర్‌ఎవర్, ఘోస్ట్‌ ట్రయల్స్‌ ఆన్‌ స్నాప్‌ మ్యాప్, సోలార్‌ సిస్టమ్‌.అనే ఆరు ఎక్స్‌క్లూజివ్‌ ఫీచర్స్‌ను ప్రవేశపెట్టింది.

సబ్‌స్క్రిప్షన్‌ సర్వీస్‌లోకి వచ్చాం అనేదానికి సూచనగా యూజర్‌ ప్రొఫైల్‌లో స్నాప్‌చాట్‌ ప్లస్‌ బ్యాడ్జ్, స్టార్‌లు కనిపిస్తాయి.

Advertisement