కాంగ్రెస్ నేతల్లో మార్పు ?

తెలంగాణ కాంగ్రెస్ పై నిన్న మొన్నటి వరకు ఆ పార్టీ నేతలకే అపనమ్మకం ఉండేది.అసలు పార్టీ సత్తా చాటుతుందా ? అధికారం సాధించగలమా ? బి‌ఆర్‌ఎస్ బీజేపీ లను దాటి ముందు నిలవగలమా ? ఇలా రకరకాల కాంగ్రెస్ నేతల్లో ఉండేవి.

దీనికి తోడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth reddy )పై సీనియర్స్ తిరుగుబాటు గళం వినిపించడం, మెల్లగా బలం కోల్పోతూ రావడంతో టీ కాంగ్రెస్ నేతలు డీలా పడ్డారు.

కొందరైతే పార్టీ మరి ఇతర పార్టీల గూటికి చేరారు.ఇక ఉన్నవారు సైతం ఇన్ యాక్టివ్ గా ఉంటూ పార్టీకి అంటీ అంటనట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు.

అయితే ఇలాంటి సందర్భంలో కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు.టీ కాంగ్రెస్ నేతలు ఊపిరినిచ్చింది.గతంలో పార్టీకి అంటి అంటనట్టుగా వ్యవహరించిన వారు సైతం ఇప్పుడు ఫుల్ జోష్ తో కనిపిస్తున్నారు.

ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komatireddy Venkat Reddy ) గత కొన్నాళ్లుగా పార్టీలో అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు.మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఆయన వ్యవహారం కాంగ్రెస్ ను తీవ్రంగా కలవరపరిచిన సంగతి విధితమే.

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్( Telangana Congress ) గెలిచే ప్రసక్తే లేదని, పార్టీ పనైపోయిందని సొంత పార్టీ పైనే ఘాటైన విమర్శలు చేశారు.దాంతో షోకాజ్ నోటీసులు సైతం ఎదుర్కొన్నారాయన.

అయితే ప్రస్తుతం ఆయనలో చాలానే మార్పు కనిపిస్తోంది.పార్టీ గెలవదని చెప్పిన ఆయనే 80 స్థానాలు పక్కా గెలుస్తుందని సవాల్ చేస్తున్నారు.

ఒకవేళ 80 స్థానాల్లో గెలవకపోతే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కూడా చెప్పుకొచ్చారు.దీంతో వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.ఎందుకంటే గతం పార్టీ గెలిచే ప్రసక్తే లేదని చెప్పిన ఆయన ఇప్పుడిలా చెప్పడాన్ని బట్టి చూస్తే కర్నాటక విజయం నేతల్లో ఏ స్థాయిలో జోష్ నింపిందో అర్థం చేసుకోవచ్చు.

ఒక్క వెంకటరెడ్డి మాత్రమే కాకుండా మిగిలిన సీనియర్ నేతలు కూడా 70-80 సీట్లు పక్కా అని చెబుతున్నారు.అయితే కాంగ్రెస్( Congress ) లో నిన్న మొన్నటి వరకు వర్గపోరు నడిచింది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

సీనియర్స్ అంతా మూకుమ్మడిగా రేవంత్ రెడ్డికి వ్యతిరేక గళం వినిపించారు.అయితే ఇప్పుడు నేతల్లో మార్పు బాగానే కనిపిస్తోంది.

Advertisement

పార్టీ గెలుపు కోసం నేతలంతా కలిసికట్టుగా పని చేసేందుకు సిద్దమౌతున్నారు.మరి ఇదే జోష్ ఎన్నికల వరకు కొనసాగిస్తారా ? లేదా మళ్ళీ వర్గపోరుకు తెర తీస్తారా అనేది చూడాలి.

తాజా వార్తలు