బి‌ఆర్‌ఎస్ రూట్ మార్చిందా..?

దేశంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు మరో ప్రత్యామ్నాయ శక్తి బి‌ఆర్‌ఎస్ అని, రాబోయే రోజుల్లో బి‌ఆర్‌ఎస్ కేంద్రంలో అధికారంలోకి రావడం పక్కా అని.

నిన్న మొన్నటి వరకు బి‌ఆర్‌ఎస్ నేతలు చెబుతూ వచ్చిన మాటలు.

ఇప్పుడు అసలు దేశంలో బి‌ఆర్‌ఎస్ ను విస్తరింపజేసే ఆలోచనే లేదని ఆ పార్టీలోని అగ్రనాయకులు చెబుతుండడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.గత కొన్నాళ్లుగా బి‌ఆర్‌ఎస్ అధినేత దేశ రాజకీయాలపై గట్టిగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే.

మహారాష్ట్ర, బిహార్, ఉత్తర ప్రదేశ్, ఆంధ్ర ప్రదేశ్.ఇలా ఆయా రాష్ట్రాలలో ఆ పార్టీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.

Has Brs Route Changed Brs , Cm Kcr , Ts Politics , Bjp, National Politics , Kt

దేశ రాజకీయాలే లక్ష్యంగా టి‌ఆర్‌ఎస్ ను బి‌ఆర్‌ఎస్( BRS PARTY ) గా మార్చిన అగ్రనాయకత్వం ఇప్పుడు రూట్ మార్చి ఓన్లీ తెలంగాణ అంటున్నారు.తాజాగా బి‌ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కే‌టి‌ఆర్( KTR ) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ ను దేశ వ్యాప్తంగా విస్తరించే ఆలోచన లేదని, ఇప్పుడు కేవలం తెలంగాణలో గెలవడమే ప్రధాన లక్ష్యం అంటూ కే‌సి‌ఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement
Has BRS Route Changed BRS , CM Kcr , Ts Politics , Bjp, National Politics , Kt

ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టడం సరైనదే అయినప్పటికి, ముందు రోజుల్లో దేశ రాజకీయాల్లో బి‌ఆర్‌ఎస్ అనుకున్న స్థాయిలో యాక్టివ్ గా ఉంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.

Has Brs Route Changed Brs , Cm Kcr , Ts Politics , Bjp, National Politics , Kt

ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ కు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు గట్టి పోటీ ఇచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఈ ఎన్నికల్లో ఏ మాత్రం తేడా కొట్టిన అధికారం చేతులు మారే అవకాశం లేకపోలేదు.అందుకే తెలంగాణలో ఎన్నికలు పూర్తి అయిన తరువాత దేశ రాజకీయాపై ఫోకస్ చేస్తే మంచిదనే అభిప్రాయంతో బి‌ఆర్‌ఎస్ అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఒకవేళ బి‌ఆర్‌ఎస్ ఓడిపోతే కే‌సి‌ఆర్( CM KCR ) జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెడతారా లేదా జాతీయ రాజకీయాలకు స్వస్తి చెప్పి పార్టీని రాష్ట్రానికే పరిమితం చేస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి.మొత్తానికి ఈసారి ఎన్నికలు బి‌ఆర్‌ఎస్ కు డూ ఆర్ డై లా మరాయనే చెప్పాలి.

మరి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు