రూ.11 లక్షలు పలికిన బుక్.. విశేషం ఏంటంటే..?

హారీపాటర్( Harry Potter ) పేరు మనం వినే ఉంటాము.ఈ పేరుతో హాలీవుడ్‌లో చాలా సినిమాలు వచ్చాయి.

అలాగే హారీపాటర్ నవలలు ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి.అయితే తాజాగా హారీపాటర్ తొలి ఎడిషన్ బుక్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.ఈ బుక్ వేలం పాటలో రూ.11 లక్షలకు అమ్ముడుపోయింది.1997లో లామినేటెడ్ బోర్డ్ కవర్‌తో బ్లూమ్స్‌బురీ తొలి ఎడిషన్ బుక్ ప్రచురించారు.ఇందులో 500 ప్రతులు ఉండగా.300 కాపీలను లైబ్రరీలకు పంపారు.తాజాగా లాస్‌ఏంజెల్స్‌ లో( Los Angeles ) ఈ బుక్ కు ఆన్ లైన్ బిడ్ నిర్వహించారు.

ఈ బిడ్ లో హారీపాటర్ తొలి ఎడిషన్ బుక్ కు( Harry Potter First Edition Book ) మంచి రెస్పాన్స్ వచ్చింది.రూ.11 లక్షలకు బిడ్ దాఖలు అయింది.ఈ విషయాన్ని అక్షన్ హౌస్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో తెలిపింది.

రిచర్డ్ వింటర్టన్ ఆక్షనీర్స్ ఈ బిడ్ చేపట్టారు.ఈ బిడ్ కు అద్భుత స్పందన వచ్చిందని ఆయన తెలిపారు.

Advertisement

ఈ అరుదైన బుక్ కు వచ్చిన స్పందన అమోఘమని, ఇదోక రికార్డు అని ఆయన చెప్పారు.జేకే రౌలింగ్( JK Rowling ) ఓరిజినల్ సిరీస్ లో ఫస్ట్ ఎడిషన్ బుక్‌ను ఇప్పటికే కోట్లాదిమంది చదివారని అన్నారు.

ఈ బుక్‌పై లైబ్రరీ స్టాంప్ కూడా ఉందని పేర్కొన్నారు.

ఇక హారీపాటర్ ఈ ఫస్ట్ ఎడిషన్ బుక్ పై లైబ్రరీ ఐడెంటిఫికేషన్ స్టిక్కర్, జేకే రౌలింగ్ లెటర్ తో కూడిన స్కిక్టర్లు ఉన్నాయని రిచర్డ్ వింటర్టన్ చెప్పారు.అయితే హారీపాటర్ ఈ అరుదైన కాపీలు అసలు ధర కంటే ఎన్నో రెట్ల ఎక్కువ ధరకు ఆన్ లైన్ బిడ్ లో అమ్ముడుపోయినట్లు బిడ్ సంస్థ తెలిపింది.ఇంత భారీ ధరకు అమ్ముడుపోవడం చూసి ఆశ్చర్యపోయామంది.

సోదరి, బావ కలిసి చేతబడి చేశారంటూ పోలీస్ కంప్లైంట్.. అధికారులు షాక్..??
Advertisement

తాజా వార్తలు