హెచ్ 1 బీ వీసా రిజిస్ట్రేషన్‌‌పై అమెరికా ప్రకటన .. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

విదేశీ నిపుణులు, వృత్తి కార్మికులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉపాధి పొందేందుకు అనుమతించే హెచ్ 1 బీ (H1B)వీసాకు సంబంధించి అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (యూఎస్‌సీఐఎస్‌) కీలక ప్రకటన జారీ చేసింది.ఎఫ్‌వై 26కు గాను హెచ్ 1 బీ వీసా రిజిస్ట్రేషన్(H1B Visa Registration) ప్రక్రియ మార్చి 7న ఉదయం 10.

30తో ప్రారంభమై.మార్చి 24న రాత్రి 10.30తో ముగుస్తుందని పేర్కొంది.భారత్, చైనా (India, China)తదితర దేశాల నుంచి ప్రతి ఏడాది వేలాది మంది ఉద్యోగులను నియమించుకోవడానికి అమెరికన్ టెక్ కంపెనీలు(American tech companies) హెచ్ 1 బీ వీసాపై ఆధారపడతాయి.

ఈ సమయంలో ఎంపిక ప్రక్రియ కోసం ప్రతి లబ్ధిదారుణ్ణి ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేయడానికి , ప్రతి లబ్ధిదారునికి అనుబంధిత రిజిస్ట్రేషన్ ఫీజును(Registration fee) చెల్లించడానికి పిటిషనర్లు, చట్టపరమైన ప్రతినిధులు తప్పనిసరిగా యూఎస్‌సీఐఎస్ ఆన్‌లైన్ ఖాతాను(Online account) ఉపయోగించాలని అధికారులు తెలిపారు.అమెరికా ఆర్ధిక సంవత్సరం ప్రారంభమయ్యే అక్టోబర్ 1 నాటికి హెచ్ 1 బీ వీసా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసేందుకు యూఎస్‌సీఐఎస్ కసరత్తు ప్రారంభించింది.2025 ఆర్ధిక సంవత్సరంలో ప్రారంభించిన బెనిఫిషియరీ సెంట్రిక్ సెలక్షన్ ప్రాసెస్‌‌ విధానాన్ని ఉపయోగిస్తామని పేర్కొంది.

కాగా, ఏటా హెచ్‌-1 బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా జారీ చేస్తుంది.వీటితో పాటు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.

Advertisement

అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.ఈ హెచ్ 1 బీ వీసాకు ప్రధాన లబ్ధిదారులు భారతీయులే.మనదేశానికి చెందిన నిపుణులు హెచ్ 1 బీ వీసా కింద అమెరికాకు వెళ్తుంటారు.

అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించడం.ఇప్పటికే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతుండటం అంతర్జాతీయంగా భయాందోళనలకు గురిచేస్తోంది.

Advertisement

తాజా వార్తలు