జీవీఎల్ ఝలక్ ఇస్తున్నారే ..? ఆ సీటు కోసం ఉత్తరాది నేతలతో లాబీయింగ్

టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ లు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు విషయంలో కొంతమంది నేతలకు అన్యాయం జరగడంపై ఏదో ఒక రూపంలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే వస్తున్నారు.

ఇప్పటికే టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు పూర్తి చేయడంతో పాటు , అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించారు.అయితే కొన్ని కొన్నిచోట్ల పరిస్థితులను బట్టి మార్పు చేర్పులు చేపడుతున్నారు.

దీంతో ఆ మార్పు చేర్పుల్లో అవకాశం దక్కించుకునేందుకు రకరకాల మార్గాల ద్వారా ఆశావాహులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.ఆ జాబితాలో బిజెపి ఎంపీ, సీనియర్ నేత జివిఎల్ నరసింహారావు( GVL Narasimha Rao ) కూడా చేరిపోయారు.

విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని జేవిఎల్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

చాలాకాలంగా ఆయన విశాఖలోనే మకాం ఉంటూ స్థానికంగా పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు.అనేక కార్యక్రమాలు పార్టీ తరఫునా, వ్యక్తిగతంగానూ చేపడుతూ, విశాఖ పార్లమెంట్( Visakhapatnam ) స్థానంలో పట్టుపెంచుకుంటూ వస్తున్నారు .విశాఖ సేటు తనదే అన్న ధీమాలో ఉంటూ జీవీఎల్ వచ్చారు.అయితే పొత్తులో భాగంగా విశాఖ స్థానాన్ని టిడిపి తీసుకుంది.

అక్కడ ఎంపీ అభ్యర్థిగా లోకేష్ తోడల్లుడు భరత్ ను ప్రకటించింది.దీనిపై అసంతృ ప్తికి గురైన జీవీఎల్ ఇంకా సేటు విషయంలో ఆశలు వదులుకోలేదు.

ఆ సీటు కోసం బిజెపి అగ్రవర్ణ నేతలు వద్ద లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు.

ఈ మేరకు ఉత్తరాది వ్యాపారులతో కూడా జీవీఎల్ తాజాగా సమావేశం నిర్వహించారు.వారి ద్వారానే బిజెపి( BJP ) అధిష్టానం పై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.జీవీఎల్ కు మద్దతుగా ఉత్తరాది నేతలు ఇప్పటికే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి చర్చించారు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

దీంతో సీటు తనదే అన్న ధీమాకు వచ్చిన జీవీఎల్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న భరత్ కు సహాయం నిరాక రణ చేస్తూ.ఎన్నికల ప్రచారానికి దూరంగానే ఉంటున్నారట.

Advertisement

తాజా వార్తలు