Alla Ramakrishna Reddy : గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆర్కే ? 

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల తనకు మంగళగిరి టిక్కెట్ ను కేటాయించకుండా, గంజి చిరంజీవిని ఇంచార్జిగా నియమించడం పై,  వైసీపీకి , ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

వైఎస్ షర్మిల వెంట నడుస్తానంటూ ప్రకటించి కాంగ్రెస్ లో చేరారు .

అలా చేరిన కొద్ది రోజులకే మళ్లీ మనసు మార్చుకుని వైసీపీలోకి తిరిగి వచ్చారు.వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా పేరుపొందిన ఆళ్ల కుటుంబంకు చెందిన ఆర్కే వైసీపీని వీడడంతో ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని గుర్తించి , ఆయనను బుజ్జగించి మళ్లీ పార్టీలోకి తీసుకువచ్చారు.

ఇది ఇలా ఉంటే , ఆర్కే ను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.దీంతో గుంటూరు రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి .ఇప్పటికే అక్కడ పోటీ చేసేందుకు సిద్ధమైన ఉమా రెడ్డి వెంకటరమణ తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంతో అసంతృప్తికి గురై హైదరాబాద్ కు వెళ్లిపోయినట్లు సమాచారం.గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ కొత్తవారిని దించేందుకు జగన్ కసరత్తు చేస్తున్నారు.

గుంటూరు తూర్పు అభ్యర్థిగా ఎమ్మెల్యే ముస్తఫా కుమర్తె కు ఈసారి అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం .ఆమె కూడా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.  తాడికొండకు సూచరితను ఖరారు చేశారు .మంగళగిరి నుంచి గంజి చిరంజీవిని ఇన్చార్జిగా ప్రకటించినా,  కాండ్రు కమల ( Kandru Kamala )కూడా రేసులో ఉన్నారు.  ఇక తెనాలి,  పొన్నూరులలో ప్రస్తుత ఎమ్మెల్యేలను మార్చే ఆలోచనలు జగన్ ఉన్నారట.

Advertisement

పత్తిపాడుకు కొత్త అభ్యర్థిని నియమించారు.గుంటూరు పశ్చిమ నుంచి చిలకలూరిపేట ఎమ్మెల్యే,  మంత్రి విడదల రజిని( Vidadala Rajini ) జోరుగా ప్రచారం నిర్వహిస్తూ ముందంజలో ఉన్నారు.

వాస్తవంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి తిరిగి మంగళగిరి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనుకున్నా.  అక్కడి నుంచి టిడిపి అభ్యర్థిగా నారా లోకేష్ పోటీ చేయబోతున్న  నేపథ్యంలో సామాజిక సమీకరణాలను లెక్కలు వేసుకుని మెజార్టీ స్థాయిలో ఉన్న పద్మశాలి వర్గానికి చెందిన గంజి చిరంజీవిని జగన్ ఇంచార్జిగా నియమించారు.త్వరలోనే ఆర్కే ను గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందట.

Advertisement

తాజా వార్తలు