టీడీపీ గూటికి చేరిన గుంటూరు జిల్లా వైసీపీ నేత‌

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ వైసీపీ నేత టీడీపీ గూటికి చేరారు.

అధికార పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసిన‌ గుదిబండ గోవ‌ర్ధ‌న్ రెడ్డి సైకిల్ ఎక్కారు.

మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు .గోవ‌ర్ధ‌న్ రెడ్డి, ఆయ‌న అనుచరుల‌కు కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.అనంత‌రం, వైసీపీ ప్ర‌భుత్వంపై గోవ‌ర్ధ‌న్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

జ‌గ‌న్ మ‌ళ్లీ సీఎం అయితే రాష్ట్రానికి భ‌విష్య‌త్ ఉండ‌ద‌ని ఆరోపించారు.స్ప‌ష్ట‌మైన ల‌క్ష్యంతోనే టీడీపీలో చేరుతున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు.

ప‌దేళ్ల పాటు వైసీపీలో కొన‌సాగిన గోవ‌ర్ధ‌న్ రెడ్డి టీడీపీలో చేర‌డం జిల్లా రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement
My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...