సాధారణంగా థియేటర్ లలో అభిమాన హీరో హీరోయిన్ ల సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అభిమానులు ఏ రేంజ్ లో హంగామా చేస్తారో మనందరికి తెలిసిందే.
థియేటర్ లో ఈలలు, కేకలు అరుపులతో రచ్చ రచ్చ చేస్తుంటారు.
ఈ క్రమంలోనే థియేటర్ లలో బయట చిన్న చిన్న గొడవలు లాంటివి జరుగుతు ఉంటాయి.కొన్ని కొన్ని సార్లు ఆ గొడవలు పెద్దగా మారి కొట్టుకోవడం, చంపుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.అయితే ఇప్పటికే ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి.
తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.కేజిఎఫ్ సినిమా చూస్తుండగా థియేటర్లలో కాల్పులు జరిగాయి.
దీనితో థియేటర్ల లోని జనాలు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు.అసలేం జరిగిందంటే కర్ణాటకలోని హవేరి జిల్లా శిగ్గావి పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
వసంత్ కుమార్ అనే వ్యక్తి సెకండ్ షో చూస్తున్నాడు.తెరపై కేజిఎఫ్ 2సినిమా నడుస్తోంది.
ఈ క్రమంలోనే వసంత కుమార్ కాలు వెళ్లి ముందు కుర్చీలో ఉన్న వ్యక్తికి తగలడంతో, వారిద్దరి మధ్య గొడవ మొదలైంది.
దీంతో సదరు వ్యక్తి బయటికి వెళ్లి పిస్టల్ తీసుకొని వచ్చి అతనిపై ఏకంగా మూడుసార్లు కాల్పులు జరపగా 2 తూటాలు వసంత కాలు, అలాగే కడుపు భాగంలో కి దూసుకెళ్లాయి.అయితే హీరో విలన్ ల మధ్య జరుగుతున్న కాల్పులు కళ్ళముందే జరగడంతో ప్రేక్షకులు భయంతో థియేటర్ బయటకు పరుగులు తీశారు.ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అప్పటివరకు సినిమాలు చూస్తూ బాగానే ఉన్న ప్రేక్షకులు ఒక్కసారిగా థియేటర్లలో కాల్పులు జరగడంతో భయంతో బయటకు పరుగులు తీశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy