వైరల్ వీడియో: అబ్బా.. క్యాచ్‌ను భలే వదిలేశావ్ భయ్య..

జెంటిల్మెన్ గేమ్ గా చెప్పుకునే క్రికెట్ లో( Cricket ) చాలాసార్లు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి.

ముఖ్యంగా ఆటగాళ్లు చేసే విన్యాసాలు అలాగే డాన్స్ లాంటి సంబంధిత సంఘటనలు ఎక్కువగా నవ్వులు పూయిస్తుంటాయి.

అయితే అప్పుడప్పుడు ఆటగాళ్లు ఫీల్డింగ్ చేసే సమయంలో క్యాచులను వదిలేసే క్రమంలో కూడా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్లు చాలానే చూసాము.ఇకపోతే తాజాగా క్రికెట్ టోర్నీలో క్యాచ్( Catch ) పట్టుకొనే సమయంలో క్యాచ్ ను నేలపాలు చేశాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ఇందులో విశేషం ఏముంది అని అనుకుంటున్నారా.

ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలకు వెళ్తే.

Advertisement

ఇంగ్లండ్‌ దేశంలోని విలేజ్ క్రికెట్‌లో భాగంగా.సందర్‌స్టీడ్ క్లబ్,( Sanderstead Club ) మెర్టన్ బోర్స్‌( Merton Boars ) జట్ల మధ్య ఓ మ్యాచ్‌ జరిగింది.ఈ మ్యాచ్ లో మెర్టన్ బోర్స్‌ బ్యాటర్ మార్క్ బార్బర్ ఓ భారీ షాట్ ఆడగా.

ఆ బంతి లాంగ్ ఆన్‌ లో గాల్లోకి వెళ్ళింది.ఇకపోతే ఆ సమయంలో సందర్‌ స్టీడ్ ఫీల్డర్ స్టూ ఎల్లెరీ( Stuey Elleray ) క్యాచ్ పట్టేందుకు ముందుకు పరుగెత్తుకొచ్చి తెగ ప్రయత్నామ్ చేసాడు.

ఈ సమయంలో అతడు మొత్తంగా ఆరు సార్లు క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించగా.చివరకు ఏడో ప్రయత్నంలో విజయవంతగా విఫలమయ్యాడు.

ఈ దెబ్బతో అక్కడ మైదానంలో ఆటగాళ్ల మధ్యలో నవ్వులు పూశాయి.ఇక ఈ క్యాచ్‌ ను రిప్లేలో చూసిన ఎల్లెరీ కూడా తెగ నవ్వేసుకున్నాడు.

వీడియో: ఎయిర్‌పోర్ట్‌లో హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడు.. జవాన్ ఎంట్రీ ఇవ్వడంతో..?
కేవలం రెండు అడుగుల స్థలంలో ఇల్లు కట్టిన ఇంజనీర్.. వీడియో చూస్తే..

ప్రస్తుతం ఈ క్యాచ్‌ కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.ఇక వీడియో చుసిన క్రికెట్ ఫ్యాన్స్‌, సోషల్ మీడియా నెటిజెన్స్ తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇందులో ఎక్కువగా ‘గొప్ప డ్రాప్డ్ క్యాచ్’, ‘క్యాచ్‌ను వదిలేసేందుకు ఫీల్డర్‌ చాలా కష్టపడ్డాడు’ అని కామెంట్ చేయగా.

Advertisement

, మరికొందరు ‘పాకిస్తాన్ ఆటగాళ్ల ఫీల్డింగ్‌ ను గుర్తుకు తెచ్చాడు’ అంటూ కామెంట్స్ చేసారు.ఇంకెందుకు ఆలశ్యం మీరు కూడా వీడియో చూసి తెగ నవ్వుకోండి.

తాజా వార్తలు