TDP:తాత పార్టీ మనవరాలు చేతికి.. బ్రహ్మణి సత్తా చూపిస్తుందా..?

చంద్రబాబు( CHANDRABABU ) కేసు రోజురోజు అనుకోని మలుపులు తిరుగుతోంది.ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ముందుకు సాగుతోంది.

మరోరకంగా చెప్పాలంటే జగన్( JAGAN ) చంద్రబాబును దెబ్బకు దెబ్బ తీస్తున్నాడని చెప్పవచ్చు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు బెయిల్ రాకుండా కేసుల మీద కేసులు విచారణ దశలో కొనసాగుతున్నాయి.

దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉన్నారు.ఇదే తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయమంతా అట్టుడికి పోతోంది.

టిడిపి శ్రేణులకు ధైర్యం చెప్పే లోకేష్( LOKESH ) కూడా రాష్ట్రంలో లేకపోవడంతో టిడిపిలో మరో ఆందోళన మొదలైంది.ఇంతటి అనిచ్చితి సమయంలో లోకేష్ ఎక్కడ ఉన్నారు.

Advertisement

ఆయనకు ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది.అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ క్రమంలోనే ఒక వార్త కూడా బయటకు వచ్చింది.నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది లోకేష్ అని తెలుస్తోంది.

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 14 గా లోకేష్ ను అరెస్టు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఈ విషయం ముందే తెలిసి ఆయన ఢిల్లీ( DELHI ) నుంచి మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.ఒకవేళ లోకేష్ కేస్ కూడా ముందుకు వెళితే ఆయనను కూడా ఎప్పుడు అరెస్టు చేసేది తెలియదు.దీంతో టీడీపీ బాధ్యతలను భుజాన వేసుకుంటుంది నారా బ్రాహ్మణి( BRAHANI ).టిడిపి కార్యకర్తలకు ధైర్యం ఇస్తూ మీడియా ముఖంగా తనదైన శైలిలో స్పందిస్తోంది.రాజమండ్రిలో జరిగిన కాగడల ప్రదర్శనలో భువనేశ్వరి ( BHUWANESHWARI ) బ్రాహ్మణి పాల్గొన్నారు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

ఇందులో బ్రాహ్మణి మాట్లాడిన మాటలు పార్టీ శ్రేణులను ఆలోచింపజేశాయి.చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదని తప్పుడు కేసు పెట్టి జైల్లో వేశారని ఆరోపించారు.

Advertisement

ప్రజా సంక్షేమం కోసం పోరాడమే ఆయన చేసిన నేరమా అని నిలదీశారు.

నేను ఓ చోట, లోకేష్ దేవాన్ష్( DEVANSH ) మరోచోట ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని, తన భర్త లోకేష్ కూడా అరెస్టు చేస్తారేమో అని చెప్పినప్పుడు కార్యకర్తలు కన్నీరు పెట్టుకున్నారు.అంతేకాకుండా మేము ఎప్పుడూ ఒంటరి కాదని తమ వెంట లక్షలాదిమంది ప్రజలు ఉన్నారంటూ మాట్లాడింది.ఒకవేళ లోకేష్ కూడా అరెస్టు అయితే మాత్రం టిడిపి బాధ్యతలు మొత్తం నారా బ్రాహ్మణి మోస్తుందని చెప్పవచ్చు.

తన తాత నందమూరి తారక రామారావు( NTR ) వంశం నుంచి వచ్చిన ఈమెకు అన్ని విధాల రాజకీయ ఆలోచనలు ఉంటాయని చెప్పగానే చెప్పవచ్చు.తాత ఏర్పాటు చేసిన టిడిపి పార్టీని మళ్లీ మనవరాలు తీసుకొని అధికారంలోకి తీసుకువస్తుందని టిడిపి శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరి చూడాలి బ్రాహ్మణి టిడిపి( TDP ) శ్రేణులకు హిత బోధ చేస్తూ ముందుకు సాగుతుందా.లేదంటే సైలెంట్ అయిపోతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

తాజా వార్తలు