గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం..: ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను గవర్నర్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇచ్చిన ఇద్దరు నేతల పేర్లు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని పేర్కొన్నారు.

గవర్నర్ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దంగా ఉందన్న కవిత ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల కోసం సదుద్దేశంతో పంపిన పేర్లను తిరస్కరించడం సరికాదన్నారు.బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీగా మారినట్లు మరోసారి నిరూపితం అయిందన్నారు.

బీసీ నాయకత్వం ఎదుగుతుంటే బీజేపీ చూసి ఓర్వలేకపోతుంది.ఈ క్రమంలో బీజేపీ,గవర్నర్ తమిళిసై వ్యవహారిస్తున్న తీరును ప్రజలు గమనించాలని కోరారు.

Advertisement
అమోఘం.. కొన్న సరుకులకు క్యారీ బ్యాగ్ ఇవ్వలేదని ఏకంగా?(వీడియో)

తాజా వార్తలు