రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్స్ లో రిపబ్లిక్ డే వేడుకలు( Republic Day Celebrations ) ఘనంగా నిర్వహించారు.

ఇందులో భాగంగా జాతీయ జెండాను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆవిష్కరించారు.

అనంతరం సైనికుల నుంచి గవర్నర్ తమిళిసై( Tamilisai Soundararajan ) గౌరవవందనం స్వీకరించారు.రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజ్యాంగస్ఫూర్తి( Constitution )కి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరని తెలిపారు.రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడిచిన పదేళ్ల నియంతృత్వ పాలనను ప్రజలు గద్దెదింపారని పేర్కొన్నారు.ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వంద రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు.

గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజారిందని పేర్కొన్నారు.టీఎస్పీఎస్సీ( TSPSC )ని ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు.

Advertisement
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు