తెలంగాణ ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం

తెలంగాణ ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదం తెలిపారు.

ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చల అనంతరం గవర్నర్ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు.

ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలపడంతో ఇవాళే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.కాగా ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ బిల్లును రూపొందించిన సంగతి తెలిసిందే.

ఆర్థిక పరమైన బిల్లు కావడంతో గవర్నర్ వద్దకు అనుమతి కోసం పంపగా ఆమె ఈ రోజు బిల్లును ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.గవర్నర్ ఆమోదంతో ఆర్టీసీ విలీన డ్రాప్ట్ బిల్లుకు అడ్డంకులు తొలగాయి.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement