హైదరాబాద్ రాంగోపాల్ పేటలో చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది.
ఈ క్రమంలో ప్రమాదం జరిగిన భవనంలో ఇవాళ జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేయనున్నారని తెలుస్తోంది.
సికింద్రాబాద్ లోని మినిస్టర్ రోడ్డులో ఉన్న భవనంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే.ఈ ఘటనలో భారీ ఆస్తినష్టం వాటిల్లింది.
ఉదయం 11 గంటలకు మంటలు చెలరేగగా.రాత్రి 9.30 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.అయితే మాల్ సిబ్బంది ముగ్గురు భవనంలో ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలో ఇవాళ అధికారులు గాలింపు చర్యలు చేపట్టనున్నారు.బిల్డింగ్ ను పరిశీలించిన అనంతరం జీహెచ్ఎంసీ టెక్నికల్ విభాగం నివేదికను సమర్పించనున్నారు.
నివేదిక ఆధారంగా తదుపరి చర్యలపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.మరోవైపు భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా భవనం దగ్గరికీ పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy