గొట్టం బాబు .. మెంటల్ బాబ్జీ ! ట్విట్టర్ లో విజయసాయి పంచ్ లు 

టిడిపి అధినేత చంద్రబాబు పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ద్వార విరుచుకుపడ్డారు.

నిత్యం ఏదో ఒక అంశంపై చంద్రబాబు , టిడిపి నాయకులను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసే విజయసాయి తాజాగా ట్విట్టర్ లో పెట్టిన పోస్టింగ్స్ వైరల్ గా మారాయి.

ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అంటూ విడుదలైన సర్వే పైన విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.చంద్రబాబును రకరకాల పేర్లతో వ్యంగంగా ప్రస్తావిస్తూ విజయ్ సాయి రెడ్డి కామెంట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తుప్పు నాయుడు PM,  పప్పు నాయుడు CM అంటూ పచ్చ మీడియా కలరింగ్ ఇచ్చింది.2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు అప్రూవల్ రేటింగ్ 80% అంటూ ఊదరగొడితే 23 సీట్లకు పడ్డాడు.ఇప్పుడు చంబాను జాకీలేసి లేపడానికి అప్రూవల్ రేటింగ్స్ అని మొదలెట్టరు.

ఈసారి సింగిల్ డిజిట్ కూడా డౌటే అంటూ ఓ న్యూస్ పేపర్ క్లిప్పింగును తన పోస్టింగ్ జత చేశారు.  ఇక్కడ తేడా వస్తే సింగపూర్ పారిపోవడానికి చాన్నాళ్ల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేసి , అక్కడ ఓ హోటల్ కొనుక్కున్నాడు.

ఒక ప్రైవేట్ జెట్ రెడీగా పెట్టుకున్నాడు.శ్రీలంక అధ్యక్షుడు గొటాబాయిలా 2024 తర్వాత ఈ గొట్టం బాబుకి అదే పరిస్థితి.ఇద్దరిదీ చివరి మజిలీ సింగపూరే.

Advertisement

"   "ప్రజలు శని వదిలించుకున్నారు గాని ఈ వరదల టైంలో మెంటల్ బాబ్జి ఉంటే రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద మకాం వేసి గంట గంటకు వాటర్ లెవెల్ కొలిచేవాడు.వరదలను కంట్రోల్ చేసినట్టు ఎల్లో మీడియాలో బిల్డప్పులు ఉండేవి.

అధికారులను పనిచేసుకో నివ్వకుండా మందలింపులు,  ప్లడ్ మాన్యువల్ చదవాలని హెచ్చరించేవాడు."   " చంద్రం ఏం చేసినా పచ్చ కుల మీడియాకు అది చాణక్యమే ! ఎందరి కాళ్లు పట్టుకున్నది, ఎంత లాభం చేసింది అందరికీ తెలుసు.

పొర్లు దండాలు పెట్టి ప్రాధేయపడ్డాడు కాబట్టే ద్రౌపది ముర్ము మర్యాద పాటించారు.కొన్నాళ్ల తర్వాత ఆమె పేరు ప్రతిపాదించింది నేనే అని కథలు మొదలెడతాడు.  

జగన్ గారి ప్రజాదరణ చూసి చంద్రబాబు పచ్చ కుల మీడియా వెన్నులో వణుకు పుట్టి ఢిల్లీలో టీడీపీ జాతకాలతో ఫేక్ సర్వేలు చేపించి జనం మీదకు వదులుతున్నారు.పాతాళానికి చేరిన చంద్రబాబు గ్రాఫ్ పెంచలేకే ఫేక్ సర్వేలు మొదలు పెట్టారు.పీకేసిన సీఎం కి మూడో స్థానం ఇచ్చినప్పుడే మీ స్థాయెంటో అర్థమైందర్రా! "   నవరత్నాలపై ప్రజల్లో సంతృప్తి, నీతి అయోగ్ ప్రశంసలు.

గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా గడపగడపకు పౌర సేవలు.అందుకే విపక్ష నేతలకు కడుపు మంట - ఇక నవ సందేహాలు తీరి నవరంద్రాలు మూత పడ్డట్టే.

Advertisement

అంటూ తాజా పోస్టింగ్ లో విజయ సాయి రెడ్డి విమర్శలు చేశారు.       .