Gori Nagori : అక్క పెళ్లి.. బావ పిలిచి మరీ రక్తమొచ్చేలా నా ప్రియుడిని కొట్టాడు.. నటి షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ బ్యూటీ, నటి గోరి నగోరి( Gori Nagori ) గురించి మనందరికి తెలిసిందే.

బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వకముందే నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.

బిగ్ బాస్ హౌస్ ద్వారా మరింత పాపులారీటీని ఏర్పరుచుకుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మకు ఒక చేదు అనుభవం ఎదురయ్యింది.

తన సొంతని సోదరి పెళ్లికి వెళ్లిన గోరి నగోరిపై ఆమె పెద్ద అక్క భర్త అనగా ఆమె బావ అతని స్నేహితులతో కలిసి దాడి చేశాడట.ఇదే విషయాన్నీ ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.

అసలు ఏం జరిగిందంటే.మే 22న గోరి నగోరి చిన్నక్క యశ్మిన్‌ వివాహం కిషణ్‌గర్‌లో జరిగింది.

Advertisement

ఈ పెళ్లికి రావాలని పిలవడంతో పాటు వస్తే అన్ని ఏర్పాట్లు చూసుకుంటానని ఆమె పెద్దక్క భర్త జావేద్‌ హుస్సేన్‌( Javed Hussain ) ఫోన్‌ చేశాడట.దాంతో ఆమె కిషణ్‌గర్‌లో అక్క పెళ్లికి తన ప్రియుడు, టీమ్‌తో కలిసి వెళ్లిందట.వివాహం బాగానే జరిగిందట.

కానీ బరాత్‌లోనే అసలు గొడవ మొదలైంది.మొదట ఆమె ప్రియుడిని దూషించిన కొందరు వ్యక్తులు ఉన్నట్టుండి అతడిపై, అతడి వెంట ఉన్న బౌన్సర్‌పై దాడి చేయడం ప్రారంభించగా వాళ్లను ఆపడానికి ప్రయత్నించిన గోరి జుట్టు పట్టుకుని లాగి పడేశారట.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియా( Social media )లో షేర్‌ చేసిన డ్యాన్సర్‌ ఇప్పటికీ ఆ షాక్‌ నుంచి తేరుకోలేకపోతున్నానంటోంది.

ఆ ఘటన తరువాత ఆమె ఆ ఘటన పై తన సోదరుడితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా వాళ్లు అసలు పట్టించుకోలేదట.అంతే కాకుండా ఇది మీ ఇంటిసమస్య, మీరు మాట్లాడుకుంటే సరిపోతుందని సలహా ఇచ్చారటీ.పైగా చాలాసేపు ఆమెను వెయిట్‌ చేయించి చివర్లో మాత్రం అతడు సెల్ఫీ తీసుకున్నాడట ఆవేదన వ్యక్తం చేసింది గోరి నగోరి.

మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?
Advertisement

తాజా వార్తలు