ఎప్పుడు కూల్ గా కనిపించే ప్రభాస్ కి కోపం వస్తే అలా చేస్తారా.. ఇది నిజంగా షాకింగ్ న్యూసే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు ప్రభాస్ ( Prabhas )ఒకరు.

ఈయన కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఈశ్వర్ సినిమా ద్వారా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు ఇలా ఈశ్వర్ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ కు అనంతరం వరుసగా అవకాశాలు వచ్చాయి.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి ( Baahubali )సినిమాలో నటించారు.ఇలా బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అప్పటినుంచి తన సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.ప్రభాస్ ఎప్పుడు చూసినా చాలా కూల్ గా అందరితో సరదాగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు.

Gopichand Revealed Top Secret About Prabhas, Prabhas,gopichand, Best Friends, To

ఈయన కోప్పడిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయని చెప్పాలి ఇలా అందరితో చాలా సరదాగా ఉండే ప్రభాస్ కి కనక కోపం వస్తే తనని ఎవరు ఫేస్ చేయలేరంటూ తన ప్రాణ స్నేహితుడు గోపీచంద్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.గోపీచంద్ ప్రభాస్( Gopichand Prabhas ) ఇద్దరూ కూడా మంచి స్నేహితులనే విషయం మనకు తెలిసిందే అయితే ప్రభాస్ కి కోపం వచ్చినప్పుడు తన పరిస్థితి ఏంటి అనే విషయాల గురించి గోపీచంద్ ఒక సందర్భంలో వెల్లడించారు.

Gopichand Revealed Top Secret About Prabhas, Prabhas,gopichand, Best Friends, To
Advertisement
Gopichand Revealed Top Secret About Prabhas, Prabhas,Gopichand, Best Friends, To

ప్రభాస్ కి సామాన్యంగా కోపం( Angry ) రాదని ఒకవేళ కోపంగా వస్తే మాత్రం గట్టిగా అందరిని అక్కడి నుంచి వెళ్ళిపొమ్మంటూ అరిచేస్తారు.ఇలా అందరిని బయటకు తోసేసి గదికి తలుపులు వేసుకొని సిగరెట్( Cigarette ) కాలుస్తారంటూ ఈ సందర్భంగా గోపీచంద్( Gopichand ) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ విషయం తెలిసినటువంటి ప్రభాస్ అభిమానులు ఏంటి ప్రభాస్ కి కోపం వస్తే ఇలా చేస్తారా ఇది ప్రభాస్ నుంచి అసలు ఊహించలేదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల సలార్ సినిమా( Salaar ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ప్రభాస్ త్వరలోనే కల్కి సినిమా( Kalki ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా మే తొమ్మిదవ తేదీ విడుదల కాబోతోంది అయితే ఎన్నికలు కూడా దగ్గర్లో ఉన్న నేపథ్యంలో ఈ సినిమాని తొమ్మిదవ తేదీ విడుదల చేస్తారా లేకపోతే వాయిదా వేస్తారా అనేది తెలియాల్సి ఉంది ఈ సినిమాతో పాటు స్పిరిట్ రాజా సాబ్ వంటి సినిమాలలో ప్రభాస్ ఎంతో బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు