ఫ్లాప్ సినిమాలు చేస్తున్నానని తెలుసు, అయినా చేసేదేం లేదు: గోపీచంద్

మ్యాచో స్టార్ గోపీచంద్( Gopichand ) ఇటీవల కాలంలో వరుసగా ఫ్లాప్స్ అందుకుంటున్న సంగతి తెలిసిందే.ఒకప్పుడు గోపీచంద్ విలన్ గా ఎంతో మెప్పించాడు.

తర్వాత హీరోగా కూడా హిట్స్ అందుకున్నాడు.అయితే ఈ హీరో కొన్నేళ్లుగా ఒక్క హిట్టు కూడా సాధించలేక చాలా రోజులు అయిపోయింది.

ఎప్పుడూ రొటీన్ సినిమాలు ( Routine movies )తీస్తుంటాడు.దర్శకులను గుడ్డిగా నమ్మేసి మూవీ లకి ఒప్పుకుంటాడు.

చివరికి అవి అతడిని ముంచేస్తుంటాయి.కట్ చేస్తే అతడి పై ఫ్లాప్ హీరో అని ఒక ముద్ర పడిపోయింది.

Advertisement

ఈరోజుల్లో థియేటర్లలో గోపీచంద్ నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే అది బాగుంటుందో లేదో అనే ఒక సందేహం ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతుంది.ఎందుకంటే అతను రీసెంట్ ఇయర్స్ లో ఒక్క మంచి సినిమా కూడా తీయలేకపోయాడు.

ఇక అతను నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా అలానే ఉంటాయని అనుకుంటున్నారు.నిజానికి ఆ సినిమాలు అలాగే ఉంటున్నాయి.

గోపీచంద్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తాను చేస్తున్న సినిమాలు ఫ్లాప్ అవుతాయని తనకు ముందే తెలుస్తుందని తెలిపాడు.

ఈ హీరో ఇటీవల ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ భీమా ( Bhima )(2024) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.దీనికి ఎ.హర్ష ( A.Harsha )దర్శకత్వం వహించారు.అయితే ఈ సినిమా తేడా కొడుతుందని తనకు ముందే తెలుసట.

చరణ్ పై విమర్శలు చేసిన వాళ్లకు స్వామీజీ స్ట్రాంగ్ కౌంటర్.. ఆయన ఏమన్నారంటే?
పుష్ప 2 లో జగన్ డైలాగ్... ఫుల్ సపోర్ట్ ఇస్తున్న వైసీపీ ఫ్యాన్స్?

కానీ ఆ సినిమాలో కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి అది హిట్ అయినా అవ్వచ్చు అని అనుకున్నాడు.దురదృష్టం కొద్దీ ఆ మూవీ ఫ్లాప్ అయిపోయింది.

Advertisement

ఈ రిజల్ట్ ను అతను ముందే ఊహించాడట.ఇక రామబాణం సినిమా( Rambanam movie ) అయితే ఆ మూవీ ప్రారంభం కాగానే అది కచ్చితంగా అస్సామే అని అతనికి బాగా అర్థమయిందట.

ఆ విషయాన్ని ఆయన నిర్భయంగా చెప్పేశాడు.

మిగతా హీరోలైతే తన సినిమా బాగానే ఉందని, ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదంటూ కవర్ చేసుకుంటారు.తాము కరెక్ట్‌ డెసిషన్ తీసుకున్నామని అంటారు.అందరినీ వెనకేసుకొస్తారు.

కానీ గోపీచంద్ మాత్రం ఎవరికీ భయపడకుండా తాను కొన్ని సినిమాలు చేస్తూ ఉంటే అవి ఫెయిల్ అవుతాయని ముందుగానే తనకు తెలుస్తుందని పేర్కొన్నాడు.ఒకసారి మూవీకి కమిట్ అయ్యాక మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు కాబట్టి చేసేదేమీ లేదు మూవీ కంప్లీట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదని గోపీచంద్ వివరించాడు.

తాజా వార్తలు