గూగుల్ పే వాడుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

ప్రస్తుతం స్మార్ట్ మొబైల్ లేనివారు ఉండరు.

మనకు డబ్బుల విషయంలో కూడా స్మార్ట్ గా దాచిపెట్టడానికి, వాడుకోవడానికి స్మార్ట్ ఫోన్ లలో గూగుల్ పే అనే యాప్ అందుబాటులో ఉంది.

ఇలా ఆర్థికంగా మనకు డబ్బులు అందించడానికైన, పొందడానికైన నేరుగా, సులువుగా ఉండే యాప్ ఫోన్లలో వాడుకలోకి వచ్చాయి.ప్రస్తుతం యూజర్లు ఎక్కువగా డబ్బులు చెల్లించడానికి కోడ్ స్కానింగ్ ద్వారా పేటీఎం వాడుతుండగా డబ్బులను ఇతరుల నుండి మనకు, మన నుండి ఇతరులకు సులువుగా చెల్లించేందుకు గూగుల్ పే యాప్ అందుబాటులో ఉంది.

ఈ యాప్ మనకు అన్ని రకాల ప్రైవెసీ అందించినప్పటికీ ప్రస్తుతం ఈ యాప్ ల మరో ఆన్ లైన్ మోసగాళ్లు చేతిలో చిక్కుతోంది.చాలామంది యూజర్లకు గూగుల్ పే లో ఎవరికైనా డబ్బులు అందించిన లేదా పొందిన మీకు తిరిగి రివార్డు వచ్చిందని మెసేజ్ ద్వారా క్లిక్ చేస్తే గూగుల్ పే పేజీ ఓపెన్ గా అవగా, స్క్రాచ్ కార్డు ఉంటుంది.

దానిని స్క్రాచ్ చేస్తే డబ్బులు మన అకౌంట్ లో వస్తాయన్న సంగతి తెలిసిందే.అయితే ఆన్ లైన్ మోసగాళ్లు చేసే మోసం కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది.మనకు గూగుల్ పే లో రూ.5 నుండి రూ.110 మాత్రమే రివార్డ్ గా వస్తుంది.పెద్ద మొత్తంలో ఎప్పుడు రివార్డులు రావు.

Advertisement

ఒకవేళ పెద్ద మొత్తంలో వస్తే చివరికి 500 రూపాయల వరకు మాత్రమే వస్తాయి.అంతేకానీ వేల లో మాత్రం రావు.ఎందుకంటే ఇక్కడ ఆన్ లైన్ మోసగాళ్లు స్క్రాచ్ చేసిన తర్వాత రూ.500 కంటే ఎక్కువ డబ్బులు చూపిస్తే క్లిక్ చేయకండి.ఒకవేళ క్లిక్ చేస్తే అది వేరే లింకు కనెక్ట్ అవుతుంది.

ఆ లింక్ ఓపెన్ చేస్తే మన అకౌంట్ నుండి డబ్బులు అన్నీ పోతాయి.ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే గూగుల్ పే లో పొందిన రివార్డు మెసేజ్ లో రావు.

ఒకవేళ అలా వస్తే అది మోసమని గమనించాలి.అంతేకాకుండా రివార్డు మీద స్క్రాచ్ చేసిన తర్వాత మరో లింక్ అనేదే అసలు రాదు.

కాబట్టి గూగుల్ పే యూజర్లు ఇలాంటివి వస్తే డౌట్ అనిపిస్తే లింకులను ఓపెన్ చెయ్యకుండా ఉండటం మంచిది.

రోత పుట్టించిన మందుల చీటి రాతతో నకిలీ డాక్టర్ పట్టివేత!
Advertisement

తాజా వార్తలు