పట్టాలు తప్పి వేగం పెరిగిన గూడ్స్ రైలు.. దూరంగా పరుగులు పెట్టిన జనాలు వీడియో వైరల్..

ప్రపంచ దేశాలలో పెద్ద రైల్వే వ్యవస్థలలో మన రైల్వే వ్యవస్థలలో ఒకటి.మనదేశంలో ప్రతిరోజు ఎన్నో లక్షల మంది ప్రయాణికులు రైల్వే వ్యవస్థ ద్వారా ప్రయాణిస్తున్నారు.

అంతేకాకుండా గూడ్స్ రైలులో ఎన్నో రకాల వస్తువులను ప్రతిరోజు చాలా తక్కువ ఖర్చుతో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు.అలాంటి రైల్వే వ్యవస్థ ఉన్న మన దేశంలో చాలా తక్కువ సమయాలలో కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.

ఎందుకంటే రైల్వే వ్యవస్థ మనదేశంలో అంతా పటిష్టంగా ఉంది.ఈ మధ్యకాలంలో ఒక గూడ్స్ రైలుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో బొగ్గు లోడుతో వెళ్తున్న ఓ గూడ్సు రైలు పట్టాలు తప్పి కూడా వేగంగా వెళుతుంది.ఈ ఘటన బిహార్‌లోని గయా ప్రాంతంలో జరిగింది.

Advertisement

ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.అయితే ఈ గూడ్స్ రైలులో 58 వ్యాగన్ల ఉండగా,53 చెల్లాచెదురుగా పట్టాలపై పడిపోయాయి.

దానివల్ల ఈ మార్గంలో రావాల్సిన పలు రైళ్లకు తీవ్ర అంతరాయం కలిగింది. బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు రైల్వే శాఖ తెలిపింది.

ఈ వీడియోకు సంబంధించిన ఒక ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.బీహార్ రాష్ట్రంలోని ఒక రైల్వే స్టేషన్ లో బుధవారం ఉదయం 6.24 నిమిషాలకు రైలు కోసం రైల్వేస్టేషన్లో ఎదురుచూస్తున్న ప్రయాణికులకు ఒక రైలు ఇంజన్ స్పీడ్ తో వస్తున్నట్లు గమనించారు.ఆ ఇంజన్ కు ఒక్క భోగి మాత్రమే ఉంది.

అప్పటికే ఆ రైలుకు ఉన్న 58 కోచ్ లలో 53 కోచ్‌లు చెల్లాచెదురయ్యాయాయి.ఓ బోగీ పట్టాలు తప్పినప్పటికీ ఇంజిన్‌ నుంచి విడిపోలేదు.అయినప్పటికీ ఆగని ఆ రైలు బోగీని లాగుకుంటూ మెరుపు వేగంతో స్టేషన్‌ను దాటేసింది.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..

దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు స్టేషన్‌ నుంచి బయటకు పరుగులు పెట్టారు.దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Advertisement

ఈ వీడియోను చూసి నన్ను నెటిజన్లు మన రైల్వే వ్యవస్థ కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది అని కామెంట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు