త్వరలో పెళ్లి.. ఊహించని విధంగా మరణించిన ప్రముఖ నటుడు.. ఏమైందంటే?

ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం.

ఇప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉన్న వ్యక్తి మరి కొద్దిసేపటికే చనిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

అందుకే మనిషి జీవితం నీటి మీద బుడగ లాంటిది అని అంటూ ఉంటారు.అయితే చాలా ఉంది యాక్టివ్గా ఉంటూ తమ పనులు తాము చేసుకుంటూనే అకస్మాత్తుగా మరణిస్తూ ఉంటారు.

ఇప్పటికే ఇలాంటి ఘటనలు సామాన్యులు సెలబ్రిటీల విషయం లో జరిగిన విషయం తెలిసిందే.తాజాగా ఒక సెలబ్రిటీ విషయంలో కూడా ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది.

ప్రముఖ హాలీవుడ్ నటుడు రే లియోట తాజాగా పగ మే 26న మరణించిన విషయం తెలిసిందే.డొమినికన్‌ రిపబ్లిక్‌లో నిద్రలోనే కన్నుమూసిన సంగతి మనందరికీ తెలిసిందే.67 ఏళ్ల రే లియోటా డేంజరస్‌ వాటర్స్‌ సినిమా షూటింగ్‌ లొకేషన్‌లో మరణించినట్లు ఆయన ప్రచారకర్త అయిన జెన్నిఫర్‌ అలెన్‌ అధికారికంగా ప్రకటించారు.మార్టిన్‌ స్కోర్సెస్‌ డైరెక్ట్‌ చేసిన గుడ్‌ ఫెల్లాస్‌ సినిమాతో మోస్ట్‌ పాపులర్‌ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు రే లియోట.

Advertisement

ఇక 1990లో వచ్చిన ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాలో మాబ్‌స్టర్‌ హెన్రీ హిల్‌ పాత్రలో నటించి అద్భుతమైన నటనను కనబరిచాడు రే లియోట.ఇకపోతే ఈ సినిమాకి అనేక క్యాటగిరీల్లో ఆస్కార్‌ లభించిన విషయం తేలిసిందే.తాజాగా ఆయన మృతితో సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.

ఆయన మరణ వార్తను సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు, అదేవిధంగా ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ సెలబ్రిటీలు అయిన రణ్‌వీర్‌ సింగ్, అర్జున్‌ కపూర్‌ లాంటి పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.రే లియోటా కాప్‌ ల్యాండ్‌,హన్నిబాల్‌,జాన్‌ క్యూ, ఐడెంటిటీ,కిల్లింగ్‌ మి సాఫ్ట్‌లీ, మ్యారేజ్ స్టోరీ, ది మెనీ సెయింట్స్‌ ఆఫ్‌ నెవార్క్‌ లాంటి సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ని ఏర్పరుచుకున్నాడు.

అంతేకాకుండా మైఖేల్‌ రుడాల్ఫ్‌ రచించిన షేడ్స్‌ ఆఫ్‌ బ్లూ: 30 ఇయర్స్‌ ఆఫ్‌ (అన్‌) ఎథికల్‌ పోలీసింగ్‌ నవల ఆధారంగా తెరకెక్కిన షేడ్స్‌ ఆఫ్‌ బ్లూ క్రైమ్‌ డ్రామా టెలివిజన్‌ సిరీస్‌లో కూడా నటించారు రే.ఇతనికి ఒక కుమార్తె కర్సెన్‌ లియోటా ఉండగా, తనకు కాబోయే భార్య జాసీ నిట్టోలోను వివాహం చేసుకోవాలనుకున్నట్లు సమాచారం.

మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?
Advertisement

తాజా వార్తలు