ఉదయం నిద్ర లేవగానే చేయకూడని మరియు చేయదగిన పనులు

ఉదయం నిద్ర లేవగానే చేయకూడని పనులు ఉదయాన్నే నిద్ర లేవగానే కొన్ని పనులను చేయకూడదు.వాటి గురించి తెలుసుకుందాం.

సాధారణంగా నిద్ర లేవగానే దేవుని ఫోటోకి దండం పెట్టుకోవటం చేస్తూ ఉంటాం.అయితే కొంత మంది ఇది మూఢనమ్మకం అని కొట్టి పారేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.

అయితే కొంతమంది ఏదైనా చెడు జరిగినప్పుడు ఈ రోజు ఎవరి ముఖం చూసామా అని బాధపడుతూ మరల ఇలా చేయకూడదు అని అనుకుంటారు.బెడ్ రూమ్ లో అసలు అద్దం ఉంచకూడదు.

ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే మన ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు.అందువల్ల బెడ్ రూమ్ లో ఉండే అద్దాన్ని రాత్రి సమయంలో మూసి ఉంచండి.

Advertisement

ఉదయం నిద్ర లేవగానే జుట్టు విరబోసుకున్న మహిళను చూడకూడదు.కొంత మంది మహిళలు నిద్ర లేవగానే వంటగదిలో పనులు చేసేస్తూ ఉంటారు.

అయితే వంటగదిని శుభ్రం చేసాక మాత్రమే పనులను ప్రారంభించాలి.కొంత మంది ఇంటిలో జంతువుల ఫోటోలను పెడుతూ ఉంటారు.

ఉదయం నిద్ర లేవగానే జంతువుల ముఖం చూడటం మంచిది కాదు.ఉదయం నిద్ర లేవగానే చేయదగిన పనులు ఉదయం నిద్ర లేవగానే మన అరచేతులను చూసుకోవాలి.

ఎందుకంటే అరచేతిలో లక్ష్మి దేవి ఉంటుంది.ఆ తర్వాత భూదేవికి నమస్కారం చేసి అప్పుడు మంచం దిగాలి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
శొంఠి పొడి రెగ్యుల‌ర్‌గా తింటే..ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

అలాగే ఉదయం నిద్ర లేవగానే సూర్యుడు, ఎర్రచందనం, సముద్రం, గోపురం, పర్వతం,బంగారం, దూడతో ఉన్న ఆవు, బొట్టుపెట్టుకుని అందంగా అలంకరించుకున్న భార్యను చూస్తే మంచి జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు