శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఈ రోజు మార్చి నెల సేవా టికెట్లు విడుదల..

తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ఎన్నో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వరున్ని కనులారా దర్శించుకోవడం కోసం, ప్రార్థించే అవకాశం కోసం ఎన్నో కోట్ల మంది భక్తులు ఎదురుచూస్తూ ఉన్నారు.

ఇప్పటికే భక్తుల సౌకర్యం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం చాలా రకాల చర్యలు చేపట్టింది.దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎక్కడికి అక్కడ కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేస్తుంది.

ఇంకా చెప్పాలంటే వేసవికాలంలో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.దీనివల్ల శ్రీవారికి దర్శనం కోసం గంటలకొద్దీ భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండవలసిన అవసరం ఉంటుంది.

ఈ నేపథ్యంలో టీటీడీ నుంచి కీలక అప్డేట్ వచ్చింది.మార్చి నెలకు సంబంధించిన రూ.300 రూపాయల ప్రత్యేక దర్శనం టోకెన్లు ఈ రోజు ఆన్ లైన్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది.ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని భక్తులను కోరింది.

Good News For Srivari Devotees.. March Month Service Tickets Are Released Today
Advertisement
Good News For Srivari Devotees.. March Month Service Tickets Are Released Today

శుక్రవారం ఉదయం 10 గంటలకు టికెట్లను టీటీడి విడుదల చేసింది.టికెట్లు బుక్ చేసుకునేందుకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అధికారిక వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాలి.వెబ్ సైట్ లో సైన్ అప్ ఆప్షన్ ద్వారా వివరాలను నమోదు చేయాలి.ఆ తర్వాత అకౌంట్ ఓపెన్ అవుతుంది.

ఆ తర్వాత అక్కడ క్లిక్ చేసి టికెట్ మొత్తానికి డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది.

Good News For Srivari Devotees.. March Month Service Tickets Are Released Today

మీ టికెట్ బుక్ అవుతుంది.బుకింగ్ ప్రక్రియ సాధారణంగా ఇతర వెబ్ సైట్ లో చేసిన విధంగానే ఉంటుంది.ఒక వేళ మీకు ఎక్కువ లడ్డూలు కావాలనుకుంటే కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు.

ఆ తర్వాత లాగిన్ పేజీకి వెళ్తుంది.లాగిన్ తర్వాత తేదీలు అందుబాటులో ఉంటాయి.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
ఉత్తరాంధ్ర భద్రాద్రి రామతీర్థం గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

ఆ తేదీలలో మీకు కావలసిన తేదీలను ఎంపిక చేసుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు