ఇండిగో విమానం ఎక్కేవారికి గుడ్ న్యూస్

ఇండిగో విమానం ( Indigo flight )ఎక్కేవారికి ఆ సంస్థ గుడ్ న్యూస్ తెలిపింది.ఈట్స్ ఆన్ బోర్డ్ క్యాటరింగ్‌లో ఇండిగో సంస్థ మార్పులు చేసింది.

ఇంటర్ గ్లోడ్ ఏవియేషన్ లిమిటెడ్ యాజమాన్యంలో ఇండిగో ఎయిర్ లైన్స్ ఎన్నో ఏళ్లుగా నడుస్తోంది.ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు గాను తాజాగా క్యాటరింగ్ సర్వీస్‌ లో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.

ప్రత్యేకంగా క్యూరేట్ చేసి మోనూ నుంచి ప్రయాణికులే తమ ఇష్టమైన ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకోవచ్చు.ఈ మేరకు మోనును ప్రయాణికు కోసం డెమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాల్లో అందుబాటులో ఉంచినట్లు ఇండిగో పేర్కొంది.

ఈ మోనులో మంచి రుచికరమైన ప్రాంతీయ వంటకాలతో పాటు స్ట్రీట్ ఫుడ్స్, అనేక వెరైటీలు ప్రయాణికుల కోసం ఉంచారు.ప్రయాణానికి ముందుగానే ప్రయాణికులు బుక్ చేసుకుంటే విమానంలో మీకు రుచికమైన ఆహారాన్ని అందిస్తారు.కస్టమర్లు, క్యాబిన్ సిబ్బంది, సర్వీస్ పార్డ్‌నర్ల నుంచి తీసుకున్న ఫీడ్ బ్యాక్ ప్రకారం మోనును తయారుచేశామని, కస్టమర్ల కోసం సేలను మెరుగుపర్చేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నామని ఇండిగో కస్టమర్ సర్వీసెస్( Indigo Customer Services ), ఆపరేషన్స్ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రాందాస్( Vice President Sanjeev Ramdas ) స్పష్టం చేశారు.

Advertisement

ఇండియా ప్రముఖ క్యారియర్ గా తమ కస్టమర్లకు మరిన్ని సేవలు అందించేందుకు సిద్దమవుతున్నట్లు సంజీవ్ రాందాస్ తెలిపారు.ప్రస్తుతం తీసుకొచ్చిన 6ఈ ఈట్స్ మెను కొత్త ఆప్షన్లను అంది్తుందని తెలిపారు.ఇండిగో తీసుకున్న ఈ నిర్ణయంతో విమానాల్లో ప్రయాణికులు మంచి ఆహారాన్ని తింటూ హాయిగా గడపవచ్చు.

సుఖవంతంగా తమ ప్రయాణం చేయవచ్చు.సాధారణంగా విమానాల్లో కొన్ని పదార్థాలను మాత్రమే అందుబాటులో ఉంచుతారు.

ప్రయాణికులకు అవి మాత్రమే అందిస్తారు.తమకు ఇష్టమైన ఆహారం తినాలంటే దొరకదు.

దీంతో ప్రయాణికుల కోసం ఇండిగో ప్రత్యేక మోనూను తయారుచేసింది.దీని వల్ల ప్రయాణికులు తమకు ఇష్టమైన ఆహారం తినవచ్చు.

వైరల్ వీడియో : సినిమా స్టైల్లో మహిళను రక్షించిన జాలర్లు..
Advertisement

తాజా వార్తలు