వాహనదారులకు గుడ్‌ న్యూస్‌

గత రెండు వారాలుగా మీడియాలో ఎక్కడ చూసినా ఆ వెయికిల్‌కు వేలకు వేలు, ఈ బండికి వేలకు వేలు ఫైన్‌ అంటూ వార్తలు వస్తున్నాయి.

కొత్తగా అమలులోకి వచ్చిన వాహన చట్టం కారణంగా వాహనదారులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు.

హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం వల్ల వెయ్యి రూపాయలు, ఏ డాక్యుమెంట్‌ లేకున్నా వేలకు వేలు ఫైన్‌ కట్టాల్సి వస్తుంది.దాంతో వాహన దారులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి హెల్మెట్‌ పెట్టుకోలేదు అంటూ చలానా రావడం, ఆటో వాలాకు 30 వేల రూపాయల చలానా, 15 వేల బండికి 20వేల ఫైన్‌ రాయడం వంటివి జరిగాయి.ఇటీవల ఒక లారీకి ఏకంగా రెండున్నర లక్షల ఫైన్‌ వేశారు.

దాంతో దేశ వ్యాప్తంగా ఈ విషయమై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పన్ను విధానంను అమలు చేసేందుకు ఒప్పుకోలేదు.

Advertisement

కేంద్రం తీసుకు వచ్చిన ఈ కొత్త రూల్స్‌ ప్రజల బాగు కోసమే.అయినా కూడా వారు ఒప్పుకోవడం లేదు.

దాంతో ఈ కొత్త చట్టంలో మార్పులు తీసుకు రావాలని నిర్ణయించారు.రాష్ట్రాలు తమకు వీలుగా ఫైన్స్‌ విషయంలో మార్పులు చేసుకోవచ్చు అంటూ కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగానే ఫైన్స్‌ వేసుకోవచ్చు.దాంతో పాత ఫైన్స్‌ను కంటిన్యూ చేసే అవకాశం ఉంది.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు