ఏడేళ్లుగా ఒక్క హిట్ కొట్టలేదు కానీ 350 కోట్ల దర్శకుడితో సినిమా నా.. ?

మాస్ జనాల్లో మస్త్ క్రేజ్ సంపాదించుకున్న హీరో గోపీచంద్.

కెరీర్ ను విలన్ పాత్రలతో మొదలు పెట్టిన ఆయన ఆ తర్వాత హీరోగా మారి చక్కటి సినిమాలు చేశాడు.

అందులో పలు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టాయి.గడిచిన కొంత కాలంగా ఆయనకు సరిగా అవకాశాలు రావడం లేదు.

ప్రస్తుత ఆయన మార్కెట్ బాగా తగ్గిపోయింది.గోపీ చంద్ ఇప్పుడు కూడా సినిమాలు చేయడానికి రెడీగా ఉండటంతో.

దర్శక నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఓకే చెప్తున్నారు.ప్రస్తుతం ఆయన అప్ కమింగ్ మూవీస్ లిస్టు పెంచుకుంటున్నాడు.

Advertisement
Goi Chand Is Commintting With Pan India Director, Gopichand, Seetimaar, Pan Indi

గోపీచంద్ ప్రస్తుతం సీటిమార్ సినిమాలో నటిస్తున్నాడు.ఆ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పాడు.

అనంతరం తేజాతో కలిసి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.వీటితో పాటటు మరో భారీ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో రన్ రాజా రన్ మూవీతో హిట్ కొట్టి.రెండో దఫాలోనే పాన్ ఇండియా మూవీ చేసిన సుజిత్ ఓ సినిమా చేస్తున్నాడు.

మెగాస్టార్ తో లూసిఫర్ రీమేక్ కమిట్ అయినా.ఈసినిమా నుంచి సుజిత్ తప్పుకున్నాడు.

Goi Chand Is Commintting With Pan India Director, Gopichand, Seetimaar, Pan Indi
అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

ప్రస్తుతం తన దగ్గర ఉన్న కథకు గోపీచంద్ లేదంటే శర్వానంద్ సూటయ్యే అవకాశం ఉన్నట్లు సుజిత్ భావిస్తున్నాడు.అయితే గోపీచంద్ తో సినిమా తీసేందుకే రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.గోపీచంద్- యువి క్రియేషన్స్ లో ఇప్పటికే జిల్ సినిమా చేశాడు.

Advertisement

ఆ సినిమా యావరేజ్ హిట్ కొట్టింది.ఈ నేపథ్యంలో యువి టీం గోపీచంద్ తో భారీ మూవీ తీయాలి అనుకుంది.సుజిత్ ఓకే అంటే.350 కోట్లతో సాహో తెరకెక్కించిన డైరెక్టర్ తో కలిసి గోపీచంద్ భారీ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసే అవకాశం ఉంది.కానీ.

సుజిత్ ఓకే చెప్తాడో? లేదో? వేచి చూడాల్సిందే.గోపీచంద్ లక్ బాగుంటే మాత్రం మళ్లీ తన సత్తా చాటుకునే అవకాశం దక్కుకుంది.

తాజా వార్తలు