విమానం కిందకు దూసుకెళ్లిన కారు.. గోఫస్ట్ అంటే ఆ మాత్రం ఉంటది మరి!

గోఫస్ట్ ఎయిర్ లైన్ కు చెందిన ఓ కారు.ఇండిగో ఏ320నియో విమానం కిందకు వెళ్లింది.

విమానం ముందు భాగంలోని చక్రాల ముందు ఆగింది.ఈ ఘటన దిల్లీలోని విమానాశ్రయంలో చోటు చేసుకుంది.

కొంచెంలో ఇండిగో సంస్థకు చెందిన విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది.దిల్లీ ఎయిర్ పోర్ట్ టీ2 టెర్మినల్ లోని 201వ స్టాండ్ లో ఈ ఘటన జరిగింది.

ప్రస్తుతం ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు జరుపుతోంది.విమానం మంగళ వారం ఉదయం దిల్లీ నుంచి పట్నాకు బయలు దేరాల్సి ఉంది.

Advertisement

ఈ క్రమంలోనే స్విఫ్ట్ డిజైర్ కారు. విమానం కిందకు దూసుకు వచ్చిందని దిల్లీ విమానాశ్రయ అధికార వర్గాలు తెలిపాయి.

ఈ ఘటనలో ఎవరూ గాయ పడలేదని అధికారులు వివరించారు.విమానానికి కూడా ఎలాంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.

ఘటన అనంతరం విమానం యథాతథంగా ప్రయాణం సాగించిందని, షెడ్యూల్ ప్రకారమే బయల్దేరనుందని వెల్లడించారు.కాగా.

ఈ ఘటనపై డీజీసీఏ రంగంలోకి దిగింది.దీనిపై విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది.

How Modern Technology Shapes The IGaming Experience
How Modern Technology Shapes The IGaming Experience

  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

ఎంత గో ఫస్ట్ అయితే మాత్రం.విమానం కంటే ముందుగా వెళ్లిపోతావా అంటూ హాస్యాస్పదంగా స్పందింస్తున్నారు.

మరికొందరేమో ఏంటి డ్రైవర్ బ్రో ఇదంటూ అడుగుతున్నారు.ఈ మధ్య ఎయిర్ ఇండిగో విమానాల్లో చాలా సమస్యలు వస్తున్నాయంటూ పలువురు ప్రయామికులు చెప్పారు.

తాజా వార్తలు