టైమ్స్ స్క్వేర్‌లో మెరిసిపోతున్న ఘట్టమనేని సితార

సితార(Sitara) సినీ ఇండస్ట్రీ లోకి రాకముందే సోషల్ మీడియా ద్వారా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న సమితి తెలిసిందే.

ఇకపోతే సితార మొదటిసారి పీఎంజే జ్యువెలర్స్(PMJ Jewels) కు బ్రాండ్ అంబాసిడర్( Brand Ambassador) గా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే.

బ్రాండ్ అంబాసిడర్ కు వచ్చిన రేమ్యునరేషన్ సితార ఓ చారిటబుల్ ట్రస్ట్ కి ఇచ్చి తన మనసు ఎంత మంచిదో చాటి చెప్పింది.అయితే తాజాగా.

పిఎంజే(PMJ) జ్యూయెల్స్ తమ కొత్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంతోషంతో ప్రకటించింది.ఈ ప్రకటనకు ముఖ్య ఆకర్షణగా మారిన సితార, బ్రాండ్ అంబాసిడర్‌గా తన చార్మ్, గ్రేస్, ఆధునిక అభిరుచిని అద్భుతంగా ప్రతిబింబిస్తున్నారు.

సితార పిఎంజే జ్యూయెల్స్ విలువలను, సౌందర్యాన్ని ఆవిష్కరించే సొగసైన ప్రతిరూపంగా నిలుస్తోంది.ఈ ప్రచారంలో ప్రదర్శించిన కొత్త కలెక్షన్ భారతీయ వారసత్వానికి, నైపుణ్యానికి యాధృష్యంగా నిలుస్తున్నాయి.

Advertisement

ఈ డిజైన్లు ఆధునిక శైలిని కలిపి అందించినవి.

ఇకపోతే, పిఎంజే జ్యూయెల్స్ తమ ప్రచారాన్ని అంతర్జాతీయస్థాయిలో విస్తరించే భాగంగా.ప్రపంచ ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో ఈ ఉత్సవాన్ని ఘనంగా ప్రారంభించింది.న్యూయార్క్ నగరం మధ్యలో కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ సితార (Brand Ambassador Sitara)ఆభరణాలతో మెరిసిపోతున్న డిజిటల్ చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.

ఈ ఆవిష్కరణ పిఎంజే జ్యూయెల్స్ ప్రపంచ విస్తరణకు, భారతీయ ఆభరణాల సౌందర్యాన్ని అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లడంలో పెద్ద అడుగుగా నిలిచింది.ఈ ప్రచారం జువెలరీకి మాత్రమే కాకుండా.

భారతీయ వారసత్వానికి, కళాత్మక నైపుణ్యానికి, ఇంకా సరిహద్దులను దాటి వెళ్తున్న సౌందర్యానికి ఘన నివాళిగా కంపెనీ పెర్కొంది.సితారతో కూడిన ఈ ప్రచారం పిఎంజే జ్యూయెల్స్ ప్రస్థానానికి సరికొత్త మార్గాన్ని జోడించింది.

లిప్ పిగ్మెంటేషన్ కు కారణాలేంటి.. ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసా?
ప్రయాణిస్తున్న రైలు నుండి ఫోన్ జారిపోతే కంగారుపడకుండా ఇలా చేయండి!

ఏదేమైనా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు ఇలా ప్రఖ్యాతిగాంచిన టైమ్స్ స్క్వేర్ లో మనిషి పోతున్న చిత్రాలు చూసి తెగ ఖుషి అవుతున్నారు.తండ్రికి తగ్గ కూతురు అంటూ అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు